మళ్లీ విలన్ గా గోపీచంద్

 మళ్లీ విలన్ గా గోపీచంద్
November 20 17:27 2017
హైద్రాబాద్,
తేజ-మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిజం’ చిత్రం కమర్షియల్‌గా హిట్ కాకపోయిన మహేష్ కెరియర్‌లో ఉత్తమ నటుడిగా నంది అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో దేవుడు క్యారెక్టర్‌లో మహేష్‌నే భయపట్టేశాడు విలన్‌గా నటించిన గోపీచంద్. ఆ తరువాత హీరోగా ప్రమోషన్ పొందిన గోపీచంద్ వరుస సినిమాలను చేస్తూనే ఉన్నారు. కాగా మొదట్లో హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన గోపీచంద్‌ హిట్ కొట్టి చాలా ఏళ్లయ్యింది.ప్రస్తుతం టాలీవుడ్‌లో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి సీనియర్ హీరోలు ప్రతినాయకుడి పాత్రల్లో రాణిస్తుండగా.. ఇటీవల రాజశేఖర్ కూడా విలన్‌గా నటించేందుకు తాను రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ కోవలోకి పాత ప్రతినాయకుడు గోపీచంద్ రీ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.మహేష్-బోయపాటి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతుండగా.. ఆ మూవీలో విలన్‌గా నటించేందుకు గోపీచంద్‌ను రంగంలోకి దింపుతున్నాడట బోయపాటి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు కాని.. మహేష్‌కు విలన్‌గా
మాత్రం గోపిచంద్ బాగా సూట్ అవుతాడని అతడితో చర్చించినట్లు సమాచారం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8218
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author