వేదాలకు నిలయం మన భారతదేశం

వేదాలకు నిలయం మన భారతదేశం
November 20 23:12 2017
పుట్టపర్తి,
భిన్న సంస్కృతులున్న భారతదేశం వేదాలకు నిలయమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ. ఎస్. ఎల్. నరసింహన్ అన్నారు.  భగవాన్ శ్రీ సత్య సాయి 92 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం పుట్టపర్తి లోని సాయికుల్వంత్ హాల్లో  శ్రీ సత్యసాయి మొదటి అంతర్జాతీయ వేద సదస్సు జరిగింది . రెండు రోజుల పాటు  జరుగనున్న ఈ సదస్సులో గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సామరస్యం,  సౌబ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ బహుళ మత ప్రార్ధనల సదస్సు జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావడం తన అదృష్టం అన్నారు. భారతదేశం వేదభూమి అంటూ అనేక భిన్నమైన సంప్రదాయాలు ఉన్నాయన్నారు. మొక్కలకు వేర్లు ఎంత ముఖ్యమో ధర్మానికి వేదాలు అంతే  ముఖ్యమని చెప్పారు.   పెద్దఎత్తున సామూహికంగా వేదపారాయనాలు   జరిగాయని, ప్రస్తుతం మరోసారి ఇక్కడ పెద్ద ఎత్తున వేదపారాయణం , వేదం ఘోష  ఇక్కడ మనం వింటున్నామన్నారు.  వేదాలు కల్పవృక్షమని , ధర్మ స్థాపన, వేద అధ్యయనం  సాధనతోనే  సాధ్యమన్నారు. అసతోమా సద్గమయ .. తమసోమ  జ్యోతిర్గమయ అంటూ అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞ్యానమనే వెలుగులోకి పయనించేందుకు వేదాలు మార్గాన్ని సుగమం చేస్తాయన్నారు . యోగ, ప్రాణాయామం ఎంతముఖ్యమో వేదాలు , వేద పారాయణం అంతే  ముఖ్యమన్నారు. సంస్కృతీ , సంప్రదాయాలకు నిలయమైన పుట్టపర్తికి లక్షలాదిమంది సాయి భక్తులు వస్తుంటారని, ఆనందం, సంతోషం, జ్ఞానాన్ని ఇలా  ప్రతి విషయాన్నీ అందరితో పంచుకోవడానికి చక్కటి అవకాశం దొరుకుతుందన్నారు. అహంకారాన్ని వదిలి , ఎవ్వరిని నొప్పించక అందరిని  సోదర భావంతో ప్రేమిస్తూ , మనమంతా ఒకే కుటుంబమని చాటి చెప్పాలన్నారు.  వేద పారాయణాలు వినడం వాళ్ళ ఎదో తెలియని  వైబ్రేషన్స్  మనలో కలుగుతాయని , ఇది మనస్సుకు ఎంతో  మంచిది  అని అన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస  ఈ అయిదు మనస్సుకు  ఏంతో తృప్తిని , సంతోషాన్ని కలిగిస్తాయన్నారు. ప్రతి మనిషి మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ , అతిధి దేవోభవ అంటూ వాటిని  సుహృద్భావంతో ఆచరించాలన్నారు.  అసత్యం , హింసను వీడి ధర్మాన్ని  అందరు  పాటించాలని చెప్పారు. సు.. దర్శన్ అంటే సన్మార్గం లో పయనించడమే అన్నారు.  సర్వమతాలు  సమానత్వమని ఎన్ని పేర్లతో పిలిచినా, ప్రార్తించినా  భగవంతుడి ఒక్కరే అని భగవాన్ సత్యసాయి బాబా  చాటి చెప్పిన ప్రభోదనలను  ఆచరించాలన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8258
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author