ప్రజలకు దగ్గరవుతున్న పోలీస్ 

ప్రజలకు దగ్గరవుతున్న పోలీస్ 
November 21 11:50 2017
విజయనగరం,
ప్రజలకు పోలీసులు చేరువయ్యేలా అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు విజయనగరం పోలీసులు. ఇటీవల కాలంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరిట ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.  శాఖాపరమైన చర్యలతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ  స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగమయ్యే దిశగా అడుగు ముందుకేస్తున్నారు. పోలీస్  పేరు చెప్పగానే కాఠిన్యమే గుర్తుకు వస్తుంది. తప్పదంటే, తమదాకా వస్తే తప్ప ఎవరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలని అనుకోని పరిస్థితులు. పోలీసులపై, ఆ శాఖపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకు ఇటీవల కాలంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరిట కార్యక్రమాలను చేపట్టారు. మరో వైపు సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యేందుకు పోలీసులు కదలి వస్తున్నారు. ఇందులో భాగంగా  విజయనగరం పోలీస్ ట్రైనింగ్ శిక్షణ కళాశాల సిబ్బంది పట్టణంలోని కొన్ని ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 5 నుంచి ఎంపిక చేసిన ప్రాంతంలో చెత్తను తొలగించి, పరిశుభ్ర వాతావరణం నెలకొల్పుతున్నారు.ప్రతి ఆదివారం విజయనగరం పట్టణంలో పోలీస్ శిక్షణ కళాశాల సిబ్బంది సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజశిఖామణి సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు. పురపాలక  సంఘ అధికారులతో సమీక్షించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అటుపై ప్రతి ఆదివారం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలను విజయనగరవాసులు అభినందిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8263
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author