నేత మాటలకు రైతులు బలి

నేత మాటలకు రైతులు బలి
November 21 18:29 2017
అమరావతి,
నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టు పరిధిలో వరిసాగుపై రైతులు పెట్టుకున్న ఆశలు సీఎం చంద్రబాబు ప్రకటనతో ఆవిరయ్యాయి. ఆయకట్టు పరిధిలో వరిసాగుకు నీరివ్వలేమని, ఆరుతడి పంటలకే నీరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వరిసాగుకు నీరు వస్తుంది, రైతులు వరిసాగుకు సమాయత్తం కావాలని అధికార పార్టీ శాసన సభ్యులు రైతులకు సమాచారాన్ని అందించారు.
సీఎం ప్రకటన అలా… అధికార పార్టీ ఎమ్మెల్యేల సమాచారం ఇలా వుండటంతో రైతులు అయోమయంలో పడ్డారు. వరిసాగుకు నీరివ్వాలని కోరుతూ ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని రైతులు ఉద్యమబాట పట్టారు. నకరికల్లు మండలం అడ్డరోడ్డు వద్ద రాస్తారోకోలతో రైతులు కదం తొక్కుతున్నారు. రైతులకు బాసటగా వైసీపీ నిలిచింది. సీపీఎం ఆధ్వర్యంలో కూడా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద నాగార్జునసాగర్‌ ఆయకట్టులో పంటలసాగుపై గందరగోళ పరిస్థితి నెలకొంది.
నాగార్జునసాగర్‌ జలాశయంలో పుష్కలంగా నీటినిల్వలు వున్నా వరిసాగుకు నీరిచ్చే విషయంలో ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నదని రైతులు విమర్శిస్తున్నారు. అధికారపార్టీ శాసనసభ్యులు వారంరోజులుగా వరిసాగుపై చేసిన ప్రచారంతో సాగుకు సమాయత్తమైన రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. రైతులతోపాటు నీటిపారుదలశాఖ అధికారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేయాలని, కేటాయింపులు, లెక్కలు తదుపరి చూసుకుందామని ప్రభుత్వం నీటి పారుదలశాఖ అధికారులకు మౌఖికఆదేశాలు ఇచ్చింది. రైతు ఉద్యమాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరిగేషన్‌ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పదిరోజులుగా కుడికాలువకు నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయంనుంచి ఇప్పటికే 7.36 టీఎంసీల నీటిని వినియోగించారు. తొమ్మిదివేల క్యూసె క్కుల నీటిని కుడికాలువకు సరఫరా చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు 3,900 క్యూసెక్కులు, గుంటూరు జిల్లాకు 5,100 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రణాళికలే కుండా నీటిని సరఫరా చేస్తుండటం నీరు వృథా అవుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం చెపుతున్న ఆరు తడి పంటల సాగుకు నీటి సరఫరా వరిసాగుకు నీటిసరఫరా పోలిస్తే 12టీఎంసీలు మాత్రమే వ్యత్యాసం వుందనేది ఇరిగేషన్‌ అధికారులు చెపుతున్న లెక్కలు తెలియజేస్తున్నాయి. సాగర్‌ ఆయకట్టులోని రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయకట్టు పరిధిలోని అధికారపార్టీ శాసనసభ్యులపై కూడా రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి వరి సాగుకు నీరిప్పించాలని రైతులు కోరుతున్నారు. మొత్తం మీద ఆయకట్టులో రైతుల మొర ఆలకించే నాథుడే కరువయ్యాడు. రైతులు ఆందోళన బాట పడుతున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖ అప్రమత్తమవుతోంది. అవసరం లేని కాలువలకు కూడా నీటి సరఫరా జరుగుతుండటంతో వేలాది క్యూసెక్కుల నీ రు వృథా అవుతోంది. కొన్నికాలువలకు షట్టర్లు లేక పోవటంతో నీరు వృథాగా కాలువల్లో పారుతున్నది. మిరప, పత్తి, కంది పంటలకు నీరు అవసరమైనప్పటికీ ఈ పంటలు సాగుచేసిన ప్రాంతానికి నీటి సరఫరా చేసి వుంటే వృథాను అరికట్టే అవకాశం వుండేది. వరిసాగుపై ప్రభుత్వం ప్రకటన చేసి వున్నా సంబంధిత పనులకు నీటిని రైతులు వినియోగించేవారు. వరిసాగుపై ప్రకటన లేకపోవటంతో రైతులు ఏ పంటలు సాగుచేయాలో తెలియని పరిస్థితిల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8317
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author