అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్స్

అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్స్
November 21 19:33 2017
కెసిఆర్ కిట్ల పథకం విజయవంతం అయిన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాలల్లో పెరుగుతున్న ప్రసూతిలకనుగుణంగా కొత్తగా మరిన్ని మాతాశిశు వైద్యశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ఏయే చోట్ల ఏ సంఖ్యలో ప్రసూతిలు జరుగుతున్నాయి? ఆయా చోట్ల       భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగు రీతిలో మరిన్ని కొత్త మాతా శిశు వైద్యశాలలు పెట్టాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి అనుమతులు తీసుకోవాలని నిర్ణయించారు. సచివాలయంలో ఈ అంశంపై పలువురు అధికారులతో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కెసిఆర్ కిట్ల పథకం అమలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసూతిల సంఖ్య పెరిగిందన్నారు. 50శాతానికి మించి ప్రసూతిలు జరుగుతున్నాయన్నారు. 5,08,336 మంది గర్బిణీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. 1,06,213 కెసిఆర్ కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. ఈ దశలో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అయితే, ఇప్పటికే 5 మాతాశిశు వైద్యశాలలకు మంజూరవగా, కొత్తగా మరో ఏడు కొత్త హాస్పిటల్స్‌కి కూడా అనుమతులు వచ్చాయన్నారు. అయితే, మరికొన్ని ఇతర ప్రాంతాల్లోనూ మరో 15 వరకు కొత్త మాతా శిశు వైద్యశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలతో కొత్తగా అవసరమైన మాతా శిశు వైద్యశాలల ప్రాంతాలతో ఒక ప్రణాళికలను సిద్ధం చేసుకుని రావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయా       వివరాలు అందిన వెంటనే సీఎం కెసిఆర్ అనుమతి తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.జిల్లా హాస్పిటల్స్ ఏర్పాటు ముమ్మరంకొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన తర్వాత ఆయా జిల్లా కేంద్రాలు లేదా, అప్పటికే అందుబాటులో ఉన్న ఆయా జిల్లాల్లోని పెద్ద పట్టణాలలో ఉన్న ఏరియా హాస్పిటల్స్ని జిల్లా హాస్పిటల్స్‌గా మార్చే ప్రక్రియని వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జిల్లా హాస్పిటల్స్ ఏర్పాటు, అప్ గ్రేడేషన్ జరుగుతున్నదని, మిగతా జిల్లాల్లోనూ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు చెప్పారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సిడి) కిట్లను పంపిణీ చేసే విషయమై అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మధుమేహం, రక్తపోటు అంశాల్లో ప్రజల ఇళ్ళ వద్దకు వెళ్ళి పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఇచ్చే కార్యక్రమంపై చర్చ జరిగింది. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి? ఏయే మందులు అందులో ఉండాలి?  కిట్ ఎలా ఉండాలి? వంటి పలు అంశాలను మంత్రి అధికారులతో చర్చించారు. నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి లక్ష్మారెడ్డి అదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పెరిగిన వసతులు, అందుబాటులోకి వచ్చిన అధునిక పరికరాలు, కెసిఆర్ కిట్ల పథకం వంటి అభివృద్ధితో దవాఖానాలకు రోగుల తాకిడి పెరిగిందన్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకనుగుణంగా డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉండేలా చూడాలని, ఇప్పటికే ప్రకటించిన నియామకాల ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఉప సెక్రటరీ సునీతా దేవి, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఆయుష్ కమిషనర్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సిఇఓ డాక్టర్ మనోహర్, ఎంఎన్‌జె డైరెక్టర్ డాక్టర్ జయలత, వైద్య సంచాలకులు డాక్టర్ లలిత కుమారి, ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, కెసిఆర్ కిట్ల పథకం ప్రత్యేకాధికారి సత్యనారాయణరెడ్డి, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండి వేణుగోపాలరావు, చీఫ్ ఇంజనీర్ సి.లక్ష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8328
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author