బేతంచర్లలో ప్రజాసంకల్పయాత్ర 

బేతంచర్లలో ప్రజాసంకల్పయాత్ర 
November 21 20:37 2017
కర్నూలు,
ఇక్కడకు వచ్చి నిలుచోవాల్సిన అవసరం ఏ ఒక్కరికీ లేకపోయినా ఆప్యాయతలు చూపిస్తున్నారని అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి పేరుపేరునా వైయస్ జగన్ కృత‌జ్ఞత‌లు తెలిపారు. చంద్రబాబు పాలన నాలుగు సంవత్సరాలు అవుతోందన్నారు. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయని బాబు కార్యకర్తలతో రెండు మూడుసార్లు చెప్పారన్నారు. నాలుగేళ్ల బాబు పాలన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను. మనకు ఎలాంటి నాయకుడు కావాలి. ఎలాంటి ముఖ్యమంత్రి కావాలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. మీరంతా సినిమాకు వెళ్తారు.
సినిమాలో అబద్ధాలు చెప్పే, మోసాలు, వెన్నుపోటు పొడిచే విలన్ నచ్చుతాడా? లేకపోతే 14 రీళ్ల సినిమాలో 13 రీళ్ల వరకు హీరో అనే వ్యక్తి ఇబ్బంది పడతాడు. న్యాయంగా, నిజాయితీగా ఉంటాడు. ఇలాంటి హీరో నచ్చుతాడా అని ప్రజల్నిజగన్ ప్రశ్నించారు. 14 రీళ్ల సినిమా తీసుకున్నా, రామాయణం, మహాభారతం, ఖురాన్ తీసుకున్నా ఏది తీసుకున్నా చివరకు నిజాయితీగా ఉన్న వ్యక్తే న్యాయంగా ఉన్న వ్యక్తే గెలుస్తారని జగన్ తెలిపారు. 13 రీళ్లవరకు హీరో దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. కానీ, 14వ రీల్ వచ్చేసరికి దేవుడు దీవిస్తాడు.. ప్రజలంతా అండగా నిలబడారు. హీరో విలన్ ను పుట్ బాల్ ఆడుకుంటాడని శ్రీ జగన్ తెలిపారు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ప్రజానీకం ఇబ్బందులు పడ్డారని శ్రీ జగన్ తెలిపారు. ఎన్నికల్లో గెలవటం కోసం, ప్రజల చేత ఓట్ల వేయించుకోవటం కోసం బాబు చేసిన వాగ్ధానాలను గుర్తు చేసుకోమని ప్రజల్ని కోరారు. ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు మైకు పుచ్చుకొని ఏం మాట్లాడారని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం ఎన్నికలప్పడు ప్రతి పేదవాడికీ మూడు సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తానని బాబు హామీ ఇచ్చారన్నారు. మరి, ఈ నాలుగేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించారా అని జగన్ ప్రశ్నించారు.
నాన్నగారి హయాంలో డోన్ లో 30,500 ఇళ్ల నిర్మాణం..
నాన్నగారి హయాంలో డోన్ నియోజకవర్గంలో 30,500 ఇళ్లు కడితే.. బాబు గారి పాలనలో ఇళ్ల నిర్మాణం దారుణంగా ఉందన్నారు. బాబు ముఖ్యమంత్రి కాకముందు రేషన్ షాపుకు వెళ్తే.. చక్కెర, పామాయిల్, కందిపప్పు, చింతపండు, కిరోసిన్ ఇచ్చేవాళ్లన్నారు. ఇవాళ రేషన్ షాపుకు వెళ్తే బియ్యం తప్ప ఏమీ ఇవ్వటం లేదని  జగన్ తెలిపారు.
కరెంటు బిల్లు ఎంత వచ్చేది?
నాలుగు సంవత్సరాల కన్నా ముందు కరెంటు బిల్లు ఎంత వస్తోందని జగన్ ప్రశ్నించారు. ఇవాళ మీ కరెంటు బిల్లు వస్తోందని ప్రశ్నిస్తే.. వెయ్యికి పైనే అని ప్రజానీకం నుంచి సమాధానం వచ్చింది. ఎన్నికల ముందు కరెంటు బిల్లు కూడా ఒక్క రూపాయి కూడా పెంచమని బాబు చెప్పిన విషయం గుర్తు చేశారు. ఇంత దారుణంగా చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు.
ఇంటింటికీ 90వేలు బాకీ పడ్డ బాబు
నాలుగు సంవత్సరాల క్రితం చంద్రబాబు జాబు రావాలంటే.. బాబు రావాలని హామీ ఇచ్చారని మరి జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండువేలు నెలనెలా ఇస్తానని చెప్పిన సంగతి శ్రీ జగన్ గుర్తు చేశారు. ఇప్పటికి బాబు వచ్చి 45 నెలలు అయిందని, అంటే ప్రతి ఇంటికీ 90వేలు బాకీ పడ్డారని  జగన్ తెలిపారు.
రైతు రుణమాఫీ, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. బాబు రుణమాఫీ ద్వారా ఇచ్చిన డబ్బు వడ్డీకైనా సరిపోయిందా.. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా.. అని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఆడవాళ్లను మోసం చేయాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత ఇక్కడున్న చాలా మంది ఆ అక్కచెల్లెమ్మల అన్నదమ్ములు, బంధువులు ఉన్నారన్నారు. మరి, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణం ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యాయా .. అని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఇన్ని అబద్ధాలు, దారుణాలు, మోసాలు చేస్తున్న వ్యక్తిని మళ్లీ ఎన్నుకునే అవకాశం ఇస్తామా అనిజగన్ ప్రశ్నించారు. ఈ రాజకీయ వ్యవస్థ మారకపోతే రాజకీయ నాయకుల్ని ప్రజలు అవహేళన చేస్తారని  జగన్ అన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో  చైతన్యం రావాలన్నారు. ఇలాంటి వ్యక్తులను వదిలేస్తే రేపు ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి ఇంటికీ కేజీ బంగారం.. ప్రతి ఇంటికీ మారుతి కారు కొనిస్తామని మభ్యపెడతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8360
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author