నగర గ్రంధాలయ అభివృద్ధికి రూ.5 కోట్లు:

నగర గ్రంధాలయ అభివృద్ధికి రూ.5 కోట్లు:
November 21 21:29 2017
హైదరాబాద్
చిక్కడపల్లి లోని నగర కేంద్ర గ్రంధాలయాభి వృద్ధికి రూ . 5  కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి కే టి ఆర్ ప్రకటించారు పలు  పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగులతో మంత్రి మాట్లాడారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆధునిక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కే టి ఆర్ ప్రకటించారు. రాష్ట్రం లో  సంవత్సరం లోపు లక్ష 12 వేల ఉద్యోగాల భర్తీని తప్పని సరిగా చేపడతామని స్పష్టం చేశారు. నారాయణగూడ లో మునిసిపల్ సర్కిల్ కార్యాలయాన్ని నిర్మిస్తామని, చిక్కడపల్లి మార్కెట్ లో జీ+5 పద్ధతి లో మార్కెట్ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. . భీమా బస్తీలో జీ+ 2 అంతస్థుల్లో  కమ్యూనిటీ హాల్ నిర్మాణం నగర కేంద్ర గ్రంధాలయ ఆభివృద్ధికి 5  కోట్ల రూపాయల కేటాయింపు చిక్కడపల్లి మార్కెట్ స్థానంలో జీ+5 అంతస్తుల్లో ఆధునిక మార్కెట్ నిర్మాణం తదితర హామీలతో రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి శ్రీ కే.టి . రామ రావు పర్యటన నగరంలో నేడు విజయవంతంగా కొనసాగింది.ఈ పర్యటన లో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నగర్ మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఎమ్మెలేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి మాగంటి గోపినాథ్ లతో కలిసి నగరం లోని పలు ప్రాంతాల్లో మంత్రి కే.టి .ర్  పర్యటించారు. బన్సీలాల్ పెట్   లో ఉన్నత ప్రమాణాలతో నిర్మించిన ఆధునిక కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు ఈ కమ్యూనిటీ హాల్ లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాలు, పార్కింగ్, తదితర వసతులు మెరుగ్గా ఉన్నాయని ఇదే విధంగా కమ్యూనిటీ హాల్ లను మరిన్ని నిర్మించాలని  మంత్రి కే టి ఆర్  ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో ప్రతి నియోజకవర్గములో కనీసం రెండు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లను నిర్మించాలని లక్షంగా నిర్నయించామని దీనిలో భాగంగా రూ. 30 .32  కోట్ల వ్యయంతో 16 ఫంక్షన్ హాల్ ల నిర్మాణాలను చేపట్టామని తెలిపారు.అనంతరం వైస్రాయి హోటల్ సమీపము లోని నాలా ను పరిశీలించారు. ఈ నాలా ద్వారా ట్యాంక్ బండ్ లోకి మురుగు నీరు కలువకుండా ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేసి మూసి లోకి కలుషిత జలాలు వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జల మండలి అధికారులను ఆదేశించారు. భీమా బస్తీలో ఖాళీ గ ఉన్న ప్రదేశంలో  జీ+2 పద్దతిలో ఆధునిక ఫంక్షన్ హాల్ నిర్మించనున్నట్టు ప్రకటించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8377
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
KTR
  Categories:
view more articles

About Article Author