పవన్ మూవీ పేరు అజ్ఞాతవాసి…?

 పవన్ మూవీ పేరు అజ్ఞాతవాసి…?
November 22 10:32 2017
హైద్రాబాద్,
పవన్‌కల్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అజ్ఞాతవాసి చిత్రం తెరకెక్కుతోంది. ఆ పేరును అనుకుంటున్నారు. ఇంకా పైనల్ కాలేదు. ప్రస్తుతం ఆ సినిమా చివరి షెడ్యూల్ కోసం పవన్ కల్యాణ్  టీమ్ యూరప్‌కు వెళ్లనుంది. హైదరాబాద్ పరిసరాల్లో చాలా సన్నివేశాలను చిత్రీకరించింది యూనిట్. నెక్స్ట్ షెడ్యూల్‌ని వారణాసి, అలహాబాద్ ప్రాంతాల్లో చేయనున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లనుంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ‘అత్తారింటికి దారేది’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. త్వరలో వారణాసిలో ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమా కాన్సెప్ట్ పోస్టర్, అనిరుధ్ కంపోజ్ చేసిన ‘బయటికొచ్చి చూస్తే…’ పాటతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చేందుకు ‘అజ్ఞాతవాసి’ ఫిల్మ్‌మేకర్స్ సిద్ధమైనట్లు తెలిసింది. 20 రోజుల వ్యవధిలో ఈ చిత్ర ఫస్ట్‌లుక్, ఆడియోను రిలీజ్ చేసి పవన్ అభిమానులను మైమరపించబోతున్నారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అదేవిధంగా సినిమా ఆడియోను వచ్చే నెల 15న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాను జనవరి 10న విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించారు.లండన్‌లో ఇండో-యూరప్ బిజినెస్ ఫోరం నుంచి అవార్డు అందుకున్న పవన్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. ఇంత పెద్ద స్థాయిలో అభిమానులు స్వాగతం పలకడాన్ని పవన్ చాలా ఎంజాయ్ చేస్తున్నారట.  పిలవకపోతేనే ఇలా జనం వస్తే ఇక పిలుపునిస్తే ఎలా ఉంటుందోనని భావిస్తున్నారు. లండన్ లోని తెలుగు సంఘాలతో పవన్ సమావేశమై ముచ్చటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కి చేరుకున్న పవన్‌కి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు‌లో అభిమానులు స్వాగతం పలికారు. మరోవైపు జనసేన ఆఫీసులో ముఖ్యనేతలతో భేటీ అయిన అధినేత అవార్డుకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమా శాటిలైట్‌ హక్కులను జెమినీ టీవీ ఆల్‌టైం రికార్డు ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు శాటిలైట్‌ హక్కుల కోసం ఆ చానెల్‌ ఏకంగా రూ. 21 కోట్లు చెల్లించినట్టు సమాచారం. మరోవైపు హిందీ శాటిలైట్‌ హక్కులకు రూ. 11 కోట్ల ధర పలికిందట. మొత్తం శాటిలైట్‌ హక్కుల రూపంలో రూ. 32 కోట్లు రావడం మాములు విషయం కాదు. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘జల్సా’, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్‌కు జోడీగా కీర్తి సురేశ్‌, అను ఎమాన్యుయెల్‌ నటిస్తుండటం అదనపు ఆకర్షణ.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8409
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author