అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగం

అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగం
November 22 20:17 2017
హైదరాబాద్
వ్యవసాయరంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కోసం సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. రైతులకు అతి కీలకమైన అంగడి వ్యవస్థకు సాంకేతిక దన్నును ఆపాదించింది. పశువుల క్రయవిక్రయాల కోసం పశు బజార్ పేరుతో ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వారసంతలకు వెళ్లే పనిలేకుండా చేతిలో ఉన్న అమ్మకాలు సాగించే సౌకర్యం కల్పించింది.రైతులు తమ పశువులను అమ్మాలన్నా.. కొత్త వి కొనాలన్నా వారసంతలు, అంగళ్లకు ప్రయాణాలు కట్టాల్సిందే. ఇందుకోసం ఒకటి, రెండు పనిదినాలను కోల్పోవాల్సి వస్తున్నది. పశువులను సంతలకు తరలించడానికి అనేక వ్యయప్రాయాసలు పడుతుంటారు. ఈ ప్రక్రియకు చరమగీతం పాడుతూ ప్రభుత్వం పశు బజార్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా రైతులు ఏ ప్రాంతం నుంచైనా కొనుగోళ్లు, అమ్మకాలు సులభంగా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీనివల్ల రైతుకు శ్రమ తగ్గడంతో పాటు ఖర్చు కూడా ప్రస్తుతం పాత వస్తువులను విక్రయించేందుకు, సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుక్కునేందుకు అనేక మంది ఓఎల్‌ఎక్స్, క్విక్కర్‌లాంటి ఆన్‌లైన్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో అమ్మదలచుకున్న వస్తువు వస్తువు ఫొటోతోపాటు దాని వివరాలు, ఫోన్ నంబర్‌ను వెబ్‌సైట్‌లో అందించాల్సి ఉంటుంది. ఆ వస్తువును కొనుక్కునే వారు ఫోన్‌లోనే విక్రయదారులతో సంప్రదించి బేరం కుదుర్చుకొని సులభంగా క్రయవిక్రయాలను పూర్తి చేసుకుంటారు. పశు బజార్ కూడా ఇదే మాదిరిగా పనిచేస్తుంది. రైతులు కూడా లోకి వెళ్లి తాము అమ్మదలచుకున్న పశువు, గొర్రెలు, మేకల ఫొటోలను తీసి రైతు యొక్క ఫోన్ నంబర్‌ను పొందుపర్చి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఎవరైనా కొనాలనుకునే రైతులు కూడా నేరుగా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఏ ప్రాంతంలో ఏ తరహా పశువులు, మేకలు, గొర్రెలు ఉన్నాయో తెలుసుకొని సదరు పశువుల యజమానిని ఫోన్‌లో నేరు గా సంప్రదించి బేరం మాట్లాడుకోవచ్చు. డబ్బులను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించి, పశువులను కొనుగోలు చేయవచ్చు.నిత్యం వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉండే రైతులకు ఒక్క రోజు ఎక్కడికైనా వెళ్లాలంటే చేయాల్సిన పని వెనకబడి పోతుంది. అలాంటిది పశువులను అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా తప్పనిసరిగా సమీప ప్రాంతంలోని అంగడికి వెళ్లాల్సిందే. అక్కడ బేరం మాట్లాడుకొని సదరు పశువును ఇంటికి తెచ్చుకునేసరికి అటు అమ్మిన వ్యక్తికి, ఇ టు కొన్న వ్యక్తికి ఇబ్బందికరంగానే ఉంటుంది. స మయం వృథా అవడంతోపాటు రాకపోకలకు అధిక ఖర్చులు చేయాల్సి వస్తున్నది. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రయోగానికి తెరతీసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలతో పశు సంవర్ధక శాఖ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీన్ని పశు సంవర్ధక, మత్స్యశాఖ ప్రధాన కార్యదర్శి సురేశ్ చందర్ ఇటీవలే ఆవిష్కరించారు. పనితీరు పరిశీలన అనంతరం రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతుల్లో కనీస విద్యాభ్యాసం చేసినవారు అధికంగానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌లో పశువుల క్రయవిక్రయాలు చేయగలుగుతారు. కంప్యూటర్ లేకపోయినప్పటికీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా, పశు బజార్‌ను ఉపయోగించుకునే వీలుంది.ఎడ్లు, బర్రెలు, మేకలు, గొర్రెలు క్రయవిక్రయాల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్ రైతులకు పూర్తిగా ఉచితంగానే సేవలందిస్తున్నది. విక్రయాల్లో దళారీ వ్యవస్థను కూడా ఈ వెబ్‌సైట్ దూరం చేయనున్నది. అత్యంత సాంకేతిక వ్యవహారంతో కూడిన ఈ వెబ్‌సైట్ భవిష్యత్‌లో రైతాంగానికి అమితంగా వినియోగం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8505
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author