వారం  రోజుల్లో అందుబాటులోకి వస్తున్న మెట్రో రైల్ సేవలు

వారం  రోజుల్లో అందుబాటులోకి వస్తున్న మెట్రో రైల్ సేవలు
November 22 23:29 2017
హైదరాబాద్
హైదరాబాదులో మెట్రో రైలు సర్వీసులు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పలు సూచనలు చేసింది. మెట్రో స్టేషన్లలో, రైలు బోగీల్లో ప్రయాణికులు ఏయే పనులు చేయాలి, ఏయే పనులు చేయకూడదో జాబితాను విడుదల చేసింది.
స్టేషన్లు, బోగీల్లో ఏయే పనులు చేయాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి?
*మెట్లు, ఎస్కలేటర్లపై జాగ్రత్తగా వెళ్లాలి
*ఎస్కలేటర్ పై ఎడమ వైపు మాత్రమే నిలబడాలి
*ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా వెళ్లాలి
*ఏదైనా సహాయం కావాలనుకుంటే కస్టమర్ సర్వీస్ లేదా స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి
*మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్, తోటి ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
*బోగీలో హ్యాండ్ రైల్ ను పట్టుకుని నిలబడాలి
*చిన్నారులు, వికలాంగులు, సీనియర్ సిటిజెన్స్, మహిళలు సీట్లలో కూర్చునేందుకు సహకరించాలి
*దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి స్టేషన్ బయటకు వెళ్లిపోవాలి
*స్టేషన్ లోకి వెళ్లే సమయంలో తనిఖీ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి సహకరించాలి
*నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలను గుర్తిస్తే… వెంటనే మెట్రో సిబ్బందికి తెలియజేయాలి
*తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చే అనౌన్స్ మెంట్లను జాగ్రత్తగా వినాలి
*రైలు ప్లాట్ ఫామ్ పై నిలిచిన తర్వాతే బోగీలోకి ప్రవేశించాలి
*ప్రయాణిస్తున్న సమయంలో టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపించాలని మెట్రో సిబ్బంది అడిగితే వారికి సహకరించాలి
*టికెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయి
*టికెట్ కౌంటర్, ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్ లో నిలబడాలి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8551
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author