లోపాల పుట్ట.. 

లోపాల పుట్ట.. 
November 23 11:08 2017
ఆదిలాబాద్,
రెవెన్యూ చిట్టా మొత్తం లోపాల పుట్టగా మారింది.. జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు చేపడుతున్న భూప్రక్షాళనలో అనేక తప్పులు వెల్లడవుతున్నాయి.. సెప్టెంబర్‌ నుంచి 15 నుంచి ఇప్పటి వరకు 210 గ్రామాల్లో భూప్రక్షాళన సర్వే పూర్తి కాగా, ఇందులో 33,790 సర్వే నంబర్లలో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని డిసెంబర్‌ 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సర్వేను మరింత వేగవంతం చేశారు. అధికారులు చేపట్టిన పట్టాల సవరణ, నవీకరణపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.
జిల్లాలోని రెవెన్యూ రికార్డుల్లో ఉండే లోపాలు సర్వేలో వెల్లడవుతున్నాయి. ఏన్నో ఏళ్ల కిందటి రికార్డులను అనేక సార్లు సవరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా.. అధికారులు పట్టించుకోకపోవడంతో రికార్డులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.4000 ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యవసాయాధికారులతో రైతు సమగ్ర సర్వే నిర్వహించింది. అయితే అందులో అనేక లోపాలు వెల్లడి కావడంతో ప్రభుత్వం భూప్రక్షాళన చేయాలని భావించింది. దీంతో పాటు కొత్త పట్టాపాసుపుస్తకాలు ఇవ్వడానికి నిర్ణయించింది. ఈ మేరకు మండలాల్లో బృందాలు ఏర్పాటు చేసి రైతుల వారీగా భూములను, రికార్డులను పరిశీలించాలని ఆదేశించింది.
జిల్లాలో 53 బృందాలు రెండు నెలల నుంచి గ్రామాల్లో పర్యటించి భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. అన్ని సక్రమంగా ఉన్న రైతులకు 1బీ ఇచ్చి వారి నుంచి ధృవీకరణ తీసుకుంటున్నారు. తప్పులున్న వారి నుంచి కూడా దరఖాస్తులు తీసుకోని జాబితాను రూపొందిస్తున్నారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో అనేక లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు పరిశీలించిన సర్వే నంబర్లలో 37 శాతం భూముల రికార్డులు తప్పులు ఉన్నట్లు తేలింది. తప్పుల సవరణకు అనేక సార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా.. పలు సాకులు చూపడం, రికార్డుల నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది అక్రమాలకు పాల్పడటం తదితర కారణాల వల్ల ఈ తప్పులు వెల్లడవుతున్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో 8.44 లక్షల ఎకరాల భూమి ఉంది. రైతుల వారీగా ఇప్పటి వరకు 3.57 లక్షల ఎకరాలు, సాగులో ఉన్న రైతుల వారీగా వివరాలు పరిశీలించారు. ఇందులో 2.39 లక్షల ఎకరాలు వాస్తవంగా సాగు చేసే రైతుల పేరున, వారి ఆధార్‌ కార్డు, ఇతర రికార్డుల మేరకు సరిగా ఉన్నట్లు తేలింది. ఇంకా 1.17 లక్షల ఎకరాలకు సంబంధించి తప్పులున్నట్లు అధికారులు గుర్తించారు. వందల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ఉంది. 255 ఎకరాలు అసైన్డ్‌భూమి సాగులో ఉన్నట్లు గుర్తించారు.
చివరికి దళితబస్తీ పథకం కింద కొనుగోలు చేసిన భూమి కూడా ఇంకా పట్టాదారు పేరుపైనే కొనసాగుతున్నట్లు భీంపూర్‌ మండలం అర్లి గ్రామంలో వెలుగుచూసింది. వాస్తవంగా పట్టాదారు నుంచి భూమి కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేసిన తరువాత సంబంధిత భూమిని ఎవరికి ఇచ్చారో వారి పేరున బదులాయించాలి. ఇలా వేల ఎకరాల భూమి క్రయవిక్రయాలు జరిగినా, బై నంబర్లు వేసి రికార్డుల్లో కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల పరిశీలనలోనే దాదాపు 900 ఎకరాలు రికార్డుల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదే పరిస్థితి అనేక గ్రామాల్లో ఉంది.
రైతు సమగ్ర సర్వే నిర్వహించిన సమయంలో 5.26 లక్షలకు సంబంధించిన సాగు భూమి వివరాలు ఇచ్చారు. దాని ప్రకారంగా వ్యవసాయ శాఖ సర్వే చేస్తే సర్వేలో 4.31 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు మాత్రమే తేలింది. ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది సర్వేలో భూమి విస్తీర్ణంపై స్పష్టత వచ్చే అవకాశముంది.
జిల్లాలో తొలుత ఇచ్చిన 1బీ ప్రకారంగా జిల్లాలో 1.32 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 1,11 లక్షల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతుల పేర్లు పరిశీలిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు విడతలుగా పేర్లు నమోదయ్యాయి. ఒకే భూమి, అదే సర్వే నంబర్‌ అవే పేర్లు రెండు సార్లు ఉన్నాయి. వాటిని తొలిగించాల్సి ఉంది.
కొంత మంది తమ భూములు ఇతరులకు అమ్ముకున్నారు. వాటిని పేరు మార్పిడి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు మార్పు చేయకపోవడంతో అమ్ముకున్న వారి పేరు రికార్డులో ఉంది. ఏళ్ల కిందటి వివరాలతో ఇంకా రెవెన్యూ రికార్డులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. రికార్డులను సంగణకంలో పొందుపర్చారు. యూనిక్‌ ఐడీ నంబర్లు ఇచ్చారు. పట్టా పాసుపుస్తకాలు, పహాణీలు ఇస్తున్నారు. కాని రైతులేవరో తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. మండలాల్లోని అనేక గ్రామాల్లో రికార్డులో పేరున్న రైతుల్లో కొంత మంది చనిపోయారు. వాటిని ఆయన కుటుంబ సభ్యుల పేరున విరాసత్‌ చేయాలి. కాః‌్ర అలా చేయకపోవడం వల్ల అలాంటి పేర్లు అనేకం ఉన్నాయి.
జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో సరిగా ఉన్న వారికి 1బీ పత్రాలు ఇస్తుండగా, రికార్డుల ప్రకారంగా లేని వారి నుంచి దరఖాస్తులు తీసుకోని పార్డు-బిలో నమోదు చేసుకుంటున్నారు. వాటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. అయితే వాటిని ఎప్పుడు సవరిస్తారు. ఎలా నవీకరిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పార్ట్‌-బిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రికార్డుల్లో పేర్లు నోచుకోక, పట్టాలు లేక, రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎవరిని అడిగినా ఏదో సాకు చెప్పి తప్పించుకున్నారే తప్ప వాటిని సరిచేయ లేదు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8566
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author