దోచెయ్.. 

 దోచెయ్.. 
November 23 11:15 2017
అనంతపురం,
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా  ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయిస్తోంది. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ.. కాంట్రాక్టర్లు, విద్యుత్తు సిబ్బంది దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. రైతుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నారు. తాజాగా ఉరవకొండ పరిధిలో ఈ దందా వెలుగులోకి వచ్చింది.
ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో అధిక సామర్థ్య పంపిణీ వ్యవస్థ (హెచ్‌వీడీఎస్‌) కింద ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రైతుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విడపనకల్లు మండలం పాల్తూరులో వసూళ్ల దందా వెలుగులోకి రావడమే అందుకు నిదర్శనం. నియంత్రికల ఏర్పాటు బాధ్యతలు చూసిన ఓ సబ్ కాంట్రాక్టర్ ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. సాధారణంగా రైతుల పొలాల్లో 63, 100 కేవీ నియంత్రికలు ఉన్నాయి. వీటి పరిధిలో 10-15 వ్యవసాయ కనెక్షన్లు ఉండటంతో నియంత్రికలు కాలిపోతున్నాయి. రైతులు నష్టపోతున్నారు.
అన్నదాతల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వాలు రెండు, మూడు బోర్లకు ఒక నియంత్రిక ఏర్పాటు చేసి, సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందించాలని నిర్ణయించాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఈఎస్‌, ప్రపంచ బ్యాంకు నిధులను రూ.కోట్లలో వెచ్చిస్తోంది. ఒక్కో ట్రాన్స్ ఫార్మర్, దానికి అవసరమైన స్తంభాలు, తీగలు తదితరాలకు దాదాపు రూ.65 వేల వరకు ఖర్చు చేస్తోంది. అప్పటికే పాత నియంత్రికల ద్వారా విద్యుత్తు కనెక్షన్‌ ఉన్న రైతులకు పూర్తి ఉచితంతో ట్రాన్స్ ఫార్మర్ అమర్చాల్సి ఉంది. ఒకవేళ కొత్త కనెక్షన్‌ తీసుకుంటే.. కేవీకి రూ.1,250 చొప్పున రైతు చెల్లించాలి. ఇక్కడే అవినీతికి తెర లేచింది. కొత్త కనెక్షన్‌ తీసుకుంటున్న రైతుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.
విడపనకల్లు మండలం పాల్తూరు ఫీడర్‌ కింద 14 ప్రధాన మదర్‌ ట్రాన్స్ ఫార్మర్లు ఉండగా.. వీటిలో ఏడింటి పరిధిలో ప్రస్తుతం కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికి 110 ట్రాన్స్ ఫార్మర్లు అమర్చారు. ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు రైతుల నుంచి రూ.80 వేల నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేశారు. దీనిపై కొందరు రైతులు ప్రశ్నించడంతో వసూళ్ల పర్వం బయటకు వచ్చింది. మరోవైపు ఇటీవల ఉరవకొండ మండలంలోనూ వందల సంఖ్యలో ట్రాన్స్ పార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ మండలంలో 17 పంచాయతీలు ఉండగా.. ఉరవకొండ, కౌకుంట్ల మినహా మిగిలిన 15 పంచాయతీల పరిధిలోని రైతుల పొలాల్లో హెచ్‌వీడీఎస్‌ కింద వందల సంఖ్యలో ట్రాన్స్ ఫార్మర్లను అమర్చారు. ఆ సమయంలో భారీగా వసూళ్ల దందా సాగినట్లు తెలుస్తోంది.
తులకు నూతన వ్యవసాయ కనెక్షన్‌ ఇవ్వాలంటే తొలుత వీఆర్వో నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి. తర్వాత రైతు దరఖాస్తు చేసుకుంటే, లైన్‌మెన్‌, ఏఈ బోరు తదితరాలు పరిశీలించి కొత్త సర్వీసుకు ఆమోదిస్తూ ప్రతిపాదన పంపాలి. కానీ అటువంటివేమీ లేకుండా ఇష్టానుసారం కొత్త సర్వీసులు పుట్టించారు. ఇందులో ఆపరేషన్‌ విభాగం పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాల్తూరులో జరిగిన ఘటనపై ఎస్పీడీసీఎల్‌ విజిలెన్స్‌ విభాగం విచారణ ఆరంభించినప్పటికీ, ఇంకా కేసు నమోదు చేయలేదు. విచారణ ముందుకు కదలకుండా ఆపే యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8569
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author