హీరోగా బిత్తిరి సత్తి

హీరోగా బిత్తిరి సత్తి
November 23 12:08 2017

హైద్రాబాద్,
బిత్తిరి సత్తి అసలు పేరు చేవెళ్ల రవి. తెలంగాణలో వస్తున్న వీ6 అనే చానల్ ఉద్యోగి. ఇప్పుడు కాస్త ఆర్థికంగా బలపడ్డాడు. అందుకే కాస్త పోస్ట్ పెంచినట్లున్నారు. మొదట్లో బాగానే పద్దతిగా పని చేసుకుపోయేవాడు. కానీ కాసులు చేతులో పడుతున్నాయి.

పేరు వస్తోంది. అందుకే అతను తన ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నాడనే ప్రచారం సాగుతోంది. తాను ఎక్కడ ఉంటే అక్కడకు కెమెరాలు తీసుకువచ్చి షూటింగ్ చేసుకోవాలనే హుకుం జారీ చేస్తున్నాడట. అందుకే వివాదం రేగింది. ఈ మధ్య ఆ టీవీ చానల్

నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించినా వీ6 యాజమాన్యం బతిమిలాడి ఆపారట.  తీన్మార్ కార్యక్రమం ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. అతని వింత చేష్టలు, చేతులు తిప్పడం, మూతి, ముక్కు వంకరగా తిప్పి మాట్లాడటం

ఆసక్తిగొలుపుతాయి. తెలంగాణ భాష, యాసతో సాగే ఈ కార్యక్రమంతో అతని పేరు మారుమోగింది. ఇప్పుడు అతను హీరోగా ఒక సినిమా మొదలైంది. అతని మేనరిజానికి.. మాటలకి తగ్గట్టుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా పేరు

“తుపాకీరాముడు”. అంతా కామెడీనే. బతుకమ్మ సినిమా తీసిన టి.ప్రభాకర్ దీనికి దర్శకుడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దీనికి నిర్మాత. అంతే కాదు..రసమయి క్రియేషన్స్ పేరిట తీస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా

జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8592
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author