తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల ఆరాచకాలు

 తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల ఆరాచకాలు
November 23 12:43 2017

హైద్రాబాద్,
వీధి వీధికీ కాన్వెంట్లు పేరుతో వందలాది స్కూళ్లు వెలుస్తున్నా వాటికి ఎలాంటి గుర్తింపు ఉండటం లేదని ఇటీవల రాష్ట్రప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ టి తిరపతిరావు కమిటీ పరిశీలనలో వెల్లడైంది. బెల్టు షాప్‌ల మాదిరి బెల్టు స్కూళ్లు యదేచ్ఛగా

పనిచేస్తున్నాయి. గుర్తింపు పొందితే అధికారుల తనిఖీలు, ఫీజులు, పద్ధతులు పాటించాల్సి వస్తుందని చాలా స్కూళ్లు అనుమతి జోలికి పోవడం లేదు. అధికారులు సైతం అనుమతి లేని విద్యాసంస్థలను తనిఖీ చేసే అవకాశం లేకపోవడం చట్టపరంగా వారికి

కలిసొస్తోంది. పెద్ద స్కూళ్లు చిన్న స్కూళ్లను బెల్టు స్కూళ్ల మాదిరి నడుపుతున్నాయి.అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్లు నడుపుతున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. అదే తరహాలో జూనియర్ కాలేజీలు సైతం కోచింగ్ సంస్థల పేరిట

తప్పించుకుంటున్నాయి. స్కూల్ పెట్టాలంటే స్థానిక సంస్థల అనుమతితో పాటు ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపక శాఖ, భవననిర్మాణ శాఖ, విద్యాశాఖ, పట్టణ పారిశుద్ధ్యశాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు వాహనాలు ఉంటే వాటికి రవాణా

శాఖ అనుమతి కూడా పొందాలి. విద్యార్థి ఒకొక్కరి పేరిట గుర్తింపు ఫీజులను చెల్లించాలి. ఇంత పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించి తడిసిమోపెడు ఖర్చు చేసే బదులు ఎలాంటి గుర్తింపు లేకుండా పాఠశాలలను నడపడం, అక్కడ చదివే విద్యార్థులను ఇతర స్కూళ్ల

నుండి పరీక్షకు అనుమతించడం చాలా తేలికైన అంశంగా మారింది. ప్రతి పాఠశాల నుండి ఎగ్జంప్షన్ ఫీజు చెల్లించి ప్రైవేటు స్టడీ విద్యార్థులు, రెగ్యులర్ విద్యార్థులు హాజరుకావచ్చు. కొన్ని స్కూళ్లు తమ స్కూళ్లలో చదవకపోయినా ఇతర స్కూళ్ల వారిని కూడా

తమ విద్యార్థులుగానే రికార్డుల్లో చూపిస్తున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆడిందే ఆటగా వారు రాసిందే రికార్డుగా మారిపోయింది.జిల్లాలో పరీక్షల నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు సైతం నామమాత్రం కావడం, వారికి ఎలాంటి

పర్యవేక్షణ అధికారాలు లేకపోవడంతో ప్రైవేటు స్కూళ్ల దందా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రైవేట్లు చెప్పుకునే సంస్థలు సైతం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి. చిన్న పిల్లలను దూర ప్రాంతాలకు పంపించలేని తల్లిదండ్రులు సమీపంలోని

చిన్న స్కూళ్లలో చేర్పిస్తున్నారు. యూనిఫారాలు, పుస్తకాల బెడద, బూట్లు, టైలు, బ్లేజర్ల గొడవ లేకుండా ఉంటాయనే కారణంతో చిన్న స్కూళ్లకు అధికంగా గిరాకీ లభిస్తోంది. దాంతో చిన్న స్కూళ్లు సాంకేతికంగా అన్ని నియమనిబంధనలను

తప్పించుకుంటూ బెల్టు స్కూళ్లుగా మారుతున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8604
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author