స్మార్ట్ దిశగా కర్నూలు అడుగులు 

స్మార్ట్ దిశగా కర్నూలు అడుగులు 
November 23 13:40 2017

కర్నూలు,
స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంద్రప్రదేశ్..స్వచ్ఛ కర్నూలు.. ఇదే నినాదం తో కర్నూలు నగరాన్ని అందంగా తీర్చిదిద్దారు మున్సిపల్ అధికారులు.  ప్రజల సహకారంతో…పర్యాటకులను ఆకర్శించే విధంగా ప్రధాన కూడళ్లలో అందమైన వాల్ పెయింటింగ్ వేసి నగరాన్ని మరింత అంద0గా తీర్చిదిద్దారు.
కర్నూలు నగరం… 52 వార్డులు.. 6లక్షల జనాభా… వెరసి.. అభివృద్ధి చెందుతున్న పట్టణంగా వెలుగొందుతున్నది. జిల్లాకు చుట్టూ పక్కల 54 మండలాలు ఉన్నాయి. ప్రతిరోజు జిల్లా కేంద్రానికి ఎంతో మంది పనుల కోసం వస్తూ వెళ్తుంటారు. రోజూ 10వేల మంది  నగరానికి రాకపోకలు కొనసాగిస్తారు. అదే సమయంలో జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రం నుంచే ఎక్కువ మంది పర్యాటక కేంద్రాలకు, ప్రసిద్ధి చెందిన ఆలయాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కర్నూలు మున్సిపల్ అధికారులు ప్రజలు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆలోచన చేశారు.నగరంలోని ప్రధాన కూడళ్లు రాజ్ విహార్ సెంటర్, కొత్త బస్టాండ్, కేసి కెనాల్ బ్రిడ్జ్,  మున్సిపల్ ఆఫీస్ రోడ్, బళ్లారి చౌరస్తా ఇలాంటి కూడళ్లలో గోడలకు సినిమా పోస్టర్లతో గతంలో డర్టీగా ఉండేవి. దీంతో మున్సిపల్ అధికారులు ప్రజల సహకారంతో గోడలపై అందమైన చిత్రాలను వేయించారు. నగరానికి వచ్చే వారిని ఆకట్టుకునేలా అందమైన బొమ్మలను గీసి.. ఆకర్షించేలా వేశారు.. స్మార్ట్ సిటీగా తీర్చిదిదేలా ప్రధాన కూడళ్లలో ఉండే రోడ్డు కిరువైపులా అందమైన వాల్ పెయింటింగ్ వేసి నగరానికి వన్నె తెచ్చారు.స్మార్ట్ సిటీగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు బాగా కృషి చేస్తున్నారు. గతంలో గోడలకు సినిమా పోస్టర్ల తో  అంధ వికారంగా ఉండేది. ఇప్పుడు గోడలకు అందమైన బొమ్మలతో నగరానికి అందంగా తయారు చేసారు.రాష్ట్రంలోని జిల్లాలలో కర్నూలు నగరాన్నీస్మార్ట్ సిటీగా ఎంపిక చేసారని మున్సిపల్ కమిషనర్ హరనాథ్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతో సిటీని మరింత అందంగా తీర్చిదిద్దుతామంటున్నారు ఆయన

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8622
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author