ప్రభుత్వాలు…మారని అభ్యాగ్యుల తలరాతలు

 ప్రభుత్వాలు…మారని అభ్యాగ్యుల తలరాతలు
November 23 14:16 2017

తిరుపతి,
వ‌ర్షం ప‌డితే లీకులు… క‌ర్ర ప‌ట్టుకుని తిప్పినా తిరగ‌ని ఫ్యాన్లు..కంపుకొట్టే టాయిలెట్లు .. మ‌చ్చ‌కైన క‌న‌బ‌డ‌ని శుభ్ర‌త‌. ఇదంతా ఎక్క‌డా అని అనుకుంటున్నారా ..? ప‌్ర‌భుత్వ నిధుల‌తో న‌డిచే తిరుప‌తిలోని అంధుల శ‌ర‌ణాల‌యంలో.  అంధుల‌కు వెళుతురు అవ‌స‌రం లేద‌నేమో క‌నీసం ఇక్క‌డ లైట్లు కూడా లేవు.  ప్ర‌భుత్వాలు ఎన్ని మారినా ఈ అభాగ్యుల త‌ల‌రాత మాత్రం మార‌డం లేదు.  విధి వంచించిన వీళ్లు చిక‌టీ గ‌దుల్లో దుర్భ‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. తిరుప‌తిలోని SBI కాల‌నీలోని అంధుల శ‌ర‌ణాల‌యం. సుమారు 70 మంది వ‌ర‌కు అంధులు ఆశ్ర‌మం పొందుతున్నారు. ఇక్క‌డ నివ‌సిస్తున్న వారు అంద‌రూ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రీపేర్ అవుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అర‌కొర వ‌స‌తుల‌తో సర్దుకుపోతూ ఎందరో దివ్యాంగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.తిరుపతి శివజ్యోతి నగర్‌లోని ప్రభుత్వ అంధుల శరణాలయంలో చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు చెదిన సుమారు 40 మంది విద్యార్థులు ఆశ్ర‌మం పొందుతున్నారు.  ప్రపంచంలో జరిగే విషయాలను ఇతరులు దినపత్రికలు చదవి వినిపించ‌డం,  టీవీలోని వార్తలు వినడం ద్వారా తెలుసుకుంటారు.  అందరితో సమానంగా ఉద్యోగాలు, సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారు.  డిగ్రీ, పీజీ, ప్రత్యేక కోర్సులు పూర్తి చేసి పోటీ పరీక్షలు, గ్రూప్స్, బ్యాంకింగ్, డిఎస్సీకి సన్నద్ధం అవుతున్న వారికి నగరంలోని వివిధ కోచింగ్ సెంటర్లు తక్కువ ఫీజులు తీసుకుంటూ సహకరిస్తున్నాయి. ప్రభుత్వం వార్తలు పుస్తకాలు ఉద్యోగ ప్రకటనలను ఎప్పతికప్పుడు చదివి వినిపించడానికి ఒక వ్యక్తిని నియమించి నెలకు కొంత మొత్తంను చెల్లిసోంది. 1997లో ప్రారంభమైన శరణాలయంలో మొదట్లో 30మందికి సరిపోయేలా భవనాన్ని నిర్మించారు. 2007లో అప్పటి ఎమ్మెల్యే మోహన్ సౌజన్యలతో మరో 40 మందికి సరిపడ భవనాన్ని విస్తరించారు.20 ఏళ్ళుకు ముందు కల్పించిన సౌకర్యాలతో కాలం వెళ్ళదీస్తున్న వీరిని ప్ర‌భుత్వాలు కానీ, అధికారులు కానీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు పలు సమస్యలతో బాధపడుతున్నా.. ఎంచుకున్న లక్ష్యం కోసం ముందును సాగుతున్నారు. శరణాలయంలో ఉన్న వారు ఏటా 10 మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు. గత ఏడాది పది మంది ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. ఏటా జనవరి 4న ఆంధ్రుల జ్ఞానదాత అయిన లూయిస్ బ్రెయిలీ జయంతి రోజున సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కలుసుకుని వారి మధురానుభూతులను పంచుకుంటారు. ఆరోజు హాజరైన పలువురు ప్రముఖులు వారు అడిగిన సాయానికి హామీ ఇవ్వడం ఆ తరువాత మ‌రిచిపోవ‌డం స‌ర్వ‌సాధ‌ర‌మైపోయింది. శరణాలయంలోని వారి కోసం తిరుపతిలోని పలువురు ప్రముఖలు, వివిధ సంస్థల వారు వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో బెడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. సేవ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేశాను. మరికొందరు తమ పుట్టిన రోజు పర్వదినాల్లో వీరితో ఇంతసేపు గడిపి సహాయం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన తరుణంలో కంప్యూటర్‌ను, ఎవరైన చదివేది రికార్డు చేసుకునేందుకు అవసరమైన టేప్‌రికార్డర్ అందచేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత అయినా అంధుల శ‌ర‌ణాల‌యంలోని క‌నీస సౌక‌ర్యాల‌పై దృష్టి సారించాలని అంధులు వేడుకొంటున్నారు. ఇక్కడి సవుస్యల పై పలుమార్లు జిల్లా కలెక్టర్‌, దివ్యాంగుల కమిషనర్, దివ్యాంగుల ఛైర్మెన్‌ను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేక‌పోయింద‌ని వాపోతున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల దినోత్సవాలు లాంటివి జరుపుతారే తప్ప, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల శరణాలయాలు, హాస్టళ్ళు  ఏ దుస్థితిలో ఉందో చూసే నాధుడే కరువైయడని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఇక్కడి శరణాలయంలో మగ్గుతున్న వారిలోని వయస్సు మీద పడిన ఓ పెద్దాయన భావోద్వేదనికి లోనై మాట్లాడుతూ  ….మా తరం ఎలాగూ అయిపోయింది కనీసం ఇక్కడి ఉన్న వారిలో యువకులు ఉన్నారు. వారిని రాబోయే తరాలైకెనా పరిచయం చేస్తూ , వారి మనుగడలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పుట్టుకతోనే అంధుడు కావడం వ‌ల్ల తన కుటుంబ సభ్యులు న‌న్నుఇంటి నుంచి తరిమెసరని ఓ అంధుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు కుటుంబం అండగా లేదని , ప్రభుత్వం తోడుగా ఉండి మా ఎదుగుదలకు తోడ్పాటునందించాలని కోరాడు.దేవుడు, కుటుంబ‌ సభ్యులు వీళ్ళ పట్ల చిన్న చూపు చూసిన , ప్రభుత్వం వీరి బాగోగులు చూస్తున్నప్పటికి ఏదో లోపం వీరిని వెంటాడుతోంది. ఇకనైనా ప్రభుత్వం వీరిని గుర్తించి వారికి తగిన వసతులు కల్పించాలని కోరుకుందాం….

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8635
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author