ఆర్మూర్ లో  ఎనిమిది క్రాప్ కాలనీలు

 ఆర్మూర్ లో  ఎనిమిది క్రాప్ కాలనీలు
November 23 17:31 2017
నిజామాబాద్,
నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని ప్రజల అవసరాలు తీర్చేందుకు శ్రీకారం చుట్టారు. నగరం అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొదటగా క్రాప్‌కాలనీల ఏర్పాటుపై ఉద్యానశాఖ సర్వే ప్రారంభించారు. ఇందుకోసం నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ మండలాలతోపాటు మాక్లూర్‌, నవీపేట, ముప్కాల్‌, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, ఎడపల్లి మండలాలను తీసుకొన్నారు.ఈ క్లస్టర్లలో ఖరీఫ్‌, రబీ, వేసవి కాలల్లో 733.97 హెక్టార్లలో కూరగాయల పండించవచ్చని భావిస్తున్నారు.జనాభాను పరిగణనలోకి తీసుకొంటూ ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి, వినియోగం, సాగు విస్తీర్ణం, అవసరమైన ప్రణాళికలతో క్రాప్‌ కాలనీలపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ఇందుకోసం ఏ సీజన్‌లో ఏ పంట ఎంత ఉత్పత్తి అవుతుందనేది కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.రైతులు పండిస్తున్న కూరగాయల సాగులో ఉల్లిగడ్డ, వంకాయ మాత్రమే వినియోగదారులకు అవసరమైనంత ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం కూరగాయలన్నీ కలిపి 1,966.60 హెక్టార్లలో సాగు చేస్తుండగా, 49,382 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోంది. అయితే వినియోగం మాత్రం 78,773.17 మెట్రిక్‌ టన్నుల వరకు ఆవుతోంది. ఇటీవల నగర అవసరాలపై చేసిన సర్వేలో ఉల్లిగడ్డ 17,640 మెట్రిక్‌ టన్నులు, 1,744 మెట్రిక్‌ టన్నుల వంకాయ ఉత్పత్తి అవసరాల కంటే కూడా ఎక్కువై ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఇక మిగతా టమాట, క్యాబేజీ, చిక్కుడు, బెండ, బీరా, ఆకుకూరలు అన్ని కలిపి 48,775.4 మెట్రిక్‌ టన్నుల లోటు కనిపిస్తోంది. వీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏఏ పంట ఏంత మేర వేయాలనే దానిపై ఉద్యానశాఖ కసరస్తు మొదలుపెట్టింది.ఉద్యానశాఖ చేసిన ప్రాథమిక అంచనాల్లో కూరగాయలు తింటున్న వారిలో 40 శాతం మందికి టమాటనే వినియోగిస్తున్నట్లు అంచనా వేశారు. మరో 10 శాతం పొటాటో ఉండగా, మిగతా 50 శాతం అన్ని కూరగాయలు తింటారని ఉద్యానశాఖ భావిస్తోంది. ఒక కూరగాయల పంటను ఒక వ్యక్తి రోజుకు, ఒక సంవత్సరానికి ఎంత తింటారనేదానిపై విశ్లేషించారు. ఉదాహారణకు టమాట ఒక వ్యక్తి రోజుకు 120 గ్రాములు వాడితే ఏడాదికి 43.8 కిలోలు వినియోగిస్తారని అలా ప్రస్తుతమున్న నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని అంచనాలు సిద్ధం చేశారు. ఇక ఉల్లిగడ్డను ఒక వ్యక్తి రోజుకు 25 గ్రాముల చోప్పున ఏడాదికి 9.12 కిలోలు వినియోగించవచ్చని లెక్కలేశారు. వీటి ప్రకారం ఒక వ్యక్తి రోజుకు సగటున 300 గ్రాముల చోప్పున ఏడాదికి 109.5 కిలోల కూరగాయలు వండుకు తింటారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం టమాట గరిష్టంగా 401 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇక ఉల్లిగడ్డ 948 హెక్టార్లలో, వంకాయ 215 హెక్టార్లలో, బెండ 201.6 హెక్టార్లలో, ఆకుకూరలు 87.8 హెక్టార్లలో, ఇతర కూరగాయలు కలుపుకుని 1966.60 హెక్టార్లలో సాగు చేస్తున్నారని వెల్లడించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8684
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author