దేశంలోనే పక్కా ప్రణాళికతో సాగుతోన్న..’ఎన్టీఆర్ భరోసా’ పథకం

దేశంలోనే పక్కా ప్రణాళికతో సాగుతోన్న..’ఎన్టీఆర్ భరోసా’ పథకం
November 23 19:38 2017
 అమరావతి
సమాజంలో కుటుంబ సభ్యుల ఆదరణ కరవై, వయసు పై బడటంతో పనిచేయడానికి శరీరం సహకరించక దుర్భర జీవితాలను అనుభవించే వయోవృద్ధులకు ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం నిజమైన భరోసాగా నిలుస్తోంది.  2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ‘ఎన్టీఆర్ భరోసా’ కార్యక్రమం రాష్ట్ర సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయన్ని లిఖిస్తోంది. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా రికార్డు సృష్టిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా 45,39,678మందికి జీవనభృతిని అందిస్తోంది. అందుకోసం ప్రభుత్వం రూ.5700కోట్లు ఖర్చు చేస్తోంది.వృద్ధులను భారంగా భావించే సంస్కృతి కేవలం నిరుపేద కుటుంబాలకే పరిమితం కాలేదని చెప్పవచ్చు. ఎగువ – దిగువ మధ్యతరగతి వర్గాల్లో కూడా వృద్ధుల దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారనేది అక్షర సత్యం. బ్రతికి ఉండగానే స్మశాన వాటికల్లో వృద్ధులను వదలి వెలుతున్న ఈ రోజుల్లో  ప్రభుత్వం వయో వృద్ధుల జీవితాలకు భద్రత కల్పిస్తూ అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛనుతో వారికి సామాజిక భద్రతను కల్పించడం జరిగింది.  ప్రస్తుతం రాప్ర వ్యాప్తంగా 45.39 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లను ఇస్తుండగా, వారిలో వృద్ధులే 21,38,300 మంది ఉండడం గమనించాల్సిన విషయం. ఇక  వితంతువులు 16,95,039 మంది, దివ్యాంగులు 5,70,979 మంది, చేనేత కార్మికులు 84,282 మంది, కల్లుగీత కార్మికులు 16,399 మంది, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 34,679 మంది పెన్షన్ తీసుకుంటున్న వారు ఈ జాబితాలో ఉన్నారు. సామాజిక భద్రత దిశగా పంపిణీ చేస్తున్న ఈ పింఛన్లను తీసుకుంటున్న వారిలో స్త్రీలు 30,43,400 మంది కాగా, పురుషులు 14,96,278 మంది ఉన్నారు.
ఫెన్షన్ పొందడానికి కావలసిన అర్హతలు
• అన్నిరకాల పెన్షన్లకు బీపీఎల్  కి చెందినవారు (తెల్లరేషన్ కార్డ్ కలవారు), ఏ ఫెన్షన్ పొందని వారు మరియు అదే జిల్లా వారు అయ్యి ఉండాలి.
• వృద్ధాప్య పింఛన్ కు 65 సంవత్సరాలు మరియు ఆ పై వయస్సున్న వారు అయ్యుండాలి.
• వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాల వయస్సు లేదా ఆ పైన వయసున్న వారై ఉండాలి.
• వికలాంగుల పెన్షన్ పొందాలంటే వయస్సుతో సంబంధం లేకుండా  40%  లేదా అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారిగా ఉండాలి.
• ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులైతే , పెన్షన్ పొందడానికి వయస్సు తో సంబంధంలేదు. 6 నెలలు వరుసగా అంటీ రిట్రోవిరల్ ట్రీట్ మెంట్  తీసుకున్నవారై ఉండాలి.
• చేనేత, కల్లుగీత కార్మికులు పెన్షన్ పొందాలంటే 50 సంవత్సరాలు లేదా ఆపైన వయసున్న వారై ఉండాలి.
పించన్ మొత్తం పెంపు: ప్రస్తుత ప్రభుత్వం 2014 అక్టోబర్ నెల నుండి ఫెన్షన్ నగదును నెలకు రూ.200/-ల నుండి  1000 రూపాయిలకు మరియు 80 శాతము ఆపైన అంగవైకల్యము కలవారికి 1500 రూపాయలకు పెంచింది.
అనర్హుల తొలగింపు: గ్రామ/వార్డు, మండల/మున్సిపాలిటి మరియు జిల్లా స్ధాయిలో ఫెన్షన్ కమిటీలు ఏర్పాటు చేసి అర్హత లేని వారిని తొలగించి అర్హులయిన లబ్దిదారులందరికీ ఫించను అందిస్తున్నది. దీని కోసం ప్రభుత్వం జి.ఓ. నెం.135ను విడుదల చేయటం జరిగింది.
పారదర్శకత: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలలో  ఉద్యోగులతో పాటు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అందరూ పాల్గొని పారదర్శకత, బాధ్యతతో అర్హులను ఎంపిక చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇటువంటి ప్రయోజనాలను పొందుతున్న వారిని జాబితాలలో నుంచి తొలిగించే విషయంలో పాలనా యంత్రాంగం ఎటువంటి రాగద్వేషాలకు తావులేని విధంగా వ్యవహరిస్తున్నది
ఆదివాసీలకు వయసు తగ్గింపు: అనేక మంది గిరిజన నాయకులు, ప్రజా ప్రతినిధులు వివిధ సంస్ధల అభ్యర్ధన మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన తెగలలోని పి.వి.టి.జి.లకు పింఛను అర్హత పొందేందుకు వయస్సు 65 నుండి 50 సంవత్సరంలకు కుదించటం జరిగింది. (జి.ఓ.నెం.157 తేది: 16.12.2014).
కరువు జిల్లా అనంతకు ఊరట: అనంతపురము జిల్లాలో ప్రాథమిక సెక్టారు మిషన్ ను  గౌ. డా. అబ్దుల్ కలామ్, మాజీ రాష్ట్రపతివర్యుల ద్వారా ప్రారంభోత్సవం చేసిన  సందర్భంలో అనేక మంది రైతుల యొక్క  అభ్యర్థన మేరకు అనంతపురం జిల్లాలో పింఛనుకు అర్హతలో ఒక భాగమైన గరిష్ట భూపరిమితిని జిల్లాలోని తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా 5 ఎకరాల నుండి 10 ఎకరాలు పెంచడం ద్వారా అనేక మంది రైతులకు కొత్తగా లబ్ది కలిగింది.
ఎక్కువ కుటుంబాలకు లబ్ది: ఎక్కువ కుటుంబాలను ఫించను పరిధిలోనికి తీసుకురావడానికి ఒక రేషన్ కార్డు పై ఒక పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. పింఛను నగదు 5 రెట్లు పెంచబడింది. కొత్త ఫించన్లు మంజూరు:  రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్, 2014 తర్వాత  11,10,907 మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసింది.
నాణ్యమైన సేవలు: ఫెన్షన్ దారులకు అందాల్సిన నగదును మధ్య దళారులు స్వాహా చేయకుండా ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ నిర్ధారణ ద్వారా ఫించన్లు పంపిణీ చేయడం జరుగుతున్నది. దీనికి గాను ప్రతి ఒక్క ఫెన్షన్ పంపిణీ అధికారికి ట్యాబ్ లు ,  స్కానర్స లు ( ఫింగర్ మరియు ఐరిస్ ) ఇవ్వబడినవి. మినహాయింపు: ఆధార్ బయో మెట్రిక్ ఫెయిల్ అయిన వారికి,  లెప్రసీ పెన్షనరుకు, అనారోగ్యంతో ఉన్న వారికి పంచాయితీ సెక్రటరీ స్వీయ నిర్ధారణ ద్వారా  పంపిణీ జరుగుతున్నది.
పోర్టబిలిటీ:  ఫించను పంపిణీ సమయంలో ఫెన్షన్ దారులు ఏదైనా అత్యవసర పనిమీద రాష్ట్రంలోని ఇతర గ్రామం/పట్టణంనకు వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఏ ప్రదేశంలో అయినా ఫెన్షన్ పొందే సదుపాయం కల్పించడం జరిగినది.
వలసదారులకు రక్షణ: పింఛను లబ్దిదారు తన పింఛను నగదు వరుసగా 3 నెలలు పొందనప్పుడు తాత్కాలిక నిలుపుదల జరుగుతుందే గాని జాబితానుండి తొలగించడం జరగదు. వారి అభ్యర్ధన ఫెన్షన్ పంపిణీ అధికారి ద్వారానే  అనగా గ్రామ పంచాయితీ సెక్రటరీ/బిల్ కలెక్టర్ సిఫార్సుతో పునరుద్ధరించే సదుపాయం కలదు.
కిడ్నీ వ్యాధిబారిన పడి ప్రభుత్వ ఆసుపత్రి లలో డయాలిసిస్ చికిత్స పొందుతున్న 2,256 మందికి ప్రతినెల రూ.2500/-లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమచేయటం జరిగింది.
పకడ్బంధీగా పింఛన్ పంపిణీ:
ప్రతీ పంచాయితీ మరియు మున్సిపల్ వార్డుకు ఒక పింఛను పంపిణీ అధికారి ఉండేలా ఆదేశించడం , పింఛనుదారునికి పెన్షన్ పంపిణీ చేసే తేది, సమయం, స్థలం, పంపిణీ అధికారి పేరు వారి మొబైల్ నంబరు వివరాలను తెలిపే బోర్డు ఏర్పాటు చేయడం, పెన్షన్ పంపిణీని రియల్ టైం లో పర్యవేక్షించడం, పెన్షన్ పంపిణీలో వాడుతున్న పరికరాలు పని చేయటం లేదో వాటి స్ధానంలో తిరిగి కొత్త పరికరాలు ఏర్పాటు చేయడం వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పింఛను పంపిణీ పకడ్బందీగా జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల ఒకటవ తారీఖు నాటికి పేదలకు చెల్లిస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లు గ్రామ పంచాయతీల స్థాయిలో ఏ రోజు ఎంత శాతం మేర  చెల్లించడం జరిగింది, ఎక్కడయినా చెల్లింపుల్లో ఆలస్యమయితే ఎందుకు? అనే దానిమీద కూడా నిఘా నేత్రం కొనసాగుతున్నది. ఈ పెన్షన్ల చెల్లింపు ప్రక్రియను రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతినెల మొదటివారం సంస్థలోని పెన్షన్ల విభాగం ‘ఆన్ లైన్’ లో రోజువారీ చెల్లింపులు మండలాలవారీగా గమనిస్తూ వారం చివరినాటికి (1-7 తేదీల మధ్య) వీటి చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాలకు కారణాలు ఏమిటి అనేది అడిగి తెలుసుకుంటున్నారు. వేలిముద్ర ద్వార జరుగుతున్న ఈ పెన్షన్ చెల్లింపుల్లో ఎక్కడయినా సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగితే, రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ లోని ఈ విభాగం వెంటనే ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ టెక్నలాజికల్ సర్వీస్ సంస్థ దృష్టిలో పెట్టి ఆయా లోపాలను  సరిచేయిస్తున్నది. వాస్తవానికి ప్రతి నెల కొత్త సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం వుంది. వృద్దులు మానసిక స్థిరత్వం కోల్పోయిగాని, కొందరి విషయంలో వేలిముద్రలు సరిగా పడనప్పుడు, చేతివేళ్లు సరిగా పనిచేయని కుస్టురోగులు విషయంలోను మండల స్థాయిలో నమోదు అయ్యే వ్యక్తిగత కేసులు ఈ సమీక్షల వల్ల, రాష్ట్ర స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి వాటిపై అమలులోవున్న నిభంధనల సడలింపును అమలుచేయడానికి వెంటనే సంభందిత కలెక్టర్ కార్యాలయాలకు ‘ఆన్ లైన్’ ఉత్తర్వులు సెర్ప్ నుంచి జారీఅవుతున్నాయి. ఇటువంటి నిఘా ఒకటి నిరంతరంగా కొనసాగుతున్నదని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలిసినప్పుడు వారు కూడా అప్రమత్తంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని సంస్థలో ఈ విభాగం డైరెక్టర్  ప్రభంజన్ రావు అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8732
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author