సీఎం యాదాద్రి పర్యటకు ఏర్పాట్లు

 సీఎం యాదాద్రి పర్యటకు ఏర్పాట్లు
November 23 19:48 2017
యాదాద్రి
ముఖ్యమంత్రి కేసీఆర్  శుక్రవారం  యాదాద్రి కి వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటులో నిమగ్నమైంది. రాయగిరిలోని అటవీ పర్యాటక ప్రదేశాలు రాయగిరి-యాదాద్రి వరకు కొనసాగిస్తున్న రహదారి నిర్మాణం పనులను, వడాయిగూడెంలోని మాల గుట్ట సమీపంలోని హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనితా రామ చంద్రన్, జేసీ రవి నాయక్ పరిశీలించి కిందిస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో అధికార యంత్రాంగం సన్నాహాలు చేపడుతున్నది. రాచకొండ కమిషనరేట్ అడిషనల్ కమిషనర్ తరుణ్ జోషి  స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించారు. 24న గుట్టకు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివాహంలో పాల్గొనే సాయి శివ ఫంక్షన్ హల్ పరిసర ప్రాంతాలు, పట్టణంలోని వివిధ కూడలిలో కసరత్తు నిర్వహించారు.
పోలీస్ శాఖ అధికారులు ముందస్తు చర్యలకు దిగింది.   ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా డాగ్ స్క్వాడ్  బృందాలు ఆలయ పరిసరాల్లో సోదాలు నిర్వహించారు.  డీసీపీ రామచంద్రా రెడ్డి, ఏసీపీ శ్రీనివాస చార్యులు  బందోబస్తు సమీక్షించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8738
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author