ఘనంగా నమిత – వీరేంద్ర చౌదరి వివాహం 

ఘనంగా నమిత – వీరేంద్ర చౌదరి వివాహం 
November 24 13:20 2017

తిరుమల,
హీరోయిన్‌ నమిత – వీరేంద్ర చౌదరి వివాహం ఘనంగా జరిగింది. తిరుపతి ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, తెలుగు, తమిళ చిత్రరంగానికి చెందిన పలువురు సినీ నటులు హాజరు అయ్యారు. కాగా గతరాత్రి వీరి సంగీత్‌ కార్యక్రమం ఓ ప్రయివేట్‌ హోటల్‌లో జరిగింది.  ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరేంద్ర చౌదరి అలియాస్‌ వీరు… పెళ్లి చేసుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితం నమిత ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.నమిత 2002లో ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా తెరకెక్కిన ‘సొంతం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత వెంకటేష్‌ హీరోగా నటించిన జెమినీ చిత్రంలో నటించింది. తెలుగులో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో నమిత ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి సారించి, అక్కడ టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8789
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author