కాలుష్యం బారిన 17 కేటగిరి సంస్థలు

కాలుష్యం బారిన 17 కేటగిరి సంస్థలు
November 24 15:19 2017
హైద్రాబాద్,
తెలంగాణలో కాలుష్యం పతాక స్థాయికి చేరింది. పరిశ్రమలు మెండికేయడం.. నోటీసులివ్వడం.. మూసివేయడం జరిగితే గాని కొలిక్కిరాలేదు. 17 కేటగిరీ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంపై నిరంతరం మానిటరింగ్ చేయనున్నారు. ప్రతీ రెండో.. నాలుగో శనివారాలు రిమోట్ క్యాలిబరేషన్‌తో ఈ పరిశ్రమలపై నిఘా పెట్టనున్నారు.సిమెంట్ (200 టీపీడీ కన్నా అధికం) బయోమెడికల్, అల్యూమినియం స్మెల్టింగ్, డ్రగ్స్ అండ్ ఫార్మా తయారీ, కాపర్ స్మెల్టింగ్, డైస్ అండ్ డైస్ ఇంటర్‌మీడియేట్, డిస్టిలరీ, ఫర్టిలైజర్, ప్లాస్టిక్ ఫార్ములేషన్, తయారీ, ఇంటిగ్రేటెడ్ ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమలన్నీ 17 కేటగిరీ పరిశ్రమలుగా గుర్తించారు కాలుష్యం పరిమితులకు మించితే .. ఆయా సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పీసీబీ సభ్యకార్యదర్శికి వెళ్లేలా అనుసంధానం చేయనున్నారు. దీంతో కాలుష్య నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.కిందిస్థాయి అధికారులు సైతం ఎప్పటికప్పుడు అప్రమతత్తంగా ఉండటానికి వీలుంటుందని.. కఠినంగా వ్యవహరించడానికి అస్కారముంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమల నుంచి వెలువడుతున్న గాలి, వాయు కాలుష్యాన్ని లెక్కించేందుకు పీసీబీ పలు చర్యలు తీసుకుంటున్నా అవి ఫలించడం లేదు. ఫిర్యాధుల మేరకు దాడులు చేసినా పీసీబీకి చిక్కడం లేదు. పై పెచ్చు టాస్క్‌ఫోర్స్ బృందాలు వెనుదిరగగానే తిరిగి కానిచ్చేస్తున్నారు.వీటన్నింటికి చెక్‌పెట్టాలంటే ఆన్‌లైన్ ఇఫ్లూయంట్ ఎమిషన్ మానిటరింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడమే శరణ్యమని సీపీసీబీ నిర్దేశించింది. దీంతో లెక్కలు ఇక నుంచి పక్కాగా ఉండనున్నాయి. గతంలో వీటిపై పెద్దగా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు.. ఎప్పుడైనా.. ఏదైనా తనిఖీల్లో దొరికితేనే దొంగ అన్నట్లుగా ఉండేది. కానీ తాజా చర్యలతో బలమైన ఆధారాలు.. సాక్ష్యాలు చిక్కనున్నాయి. 15 నిమిషాల వ్యవధికొకసారి.. డేటాను అప్‌గ్రేడ్ చేస్తుంది. ఏ నిమిషంలో కాలుష్యం పెరిగినా.. ఎంత మేరకు పెరిగినా.. లెక్కలతో సహా డేటా అప్‌గ్రేడ్ కానుంది. ఈ డేటా ఆధారంగా.. దీనినే సాక్ష్యంగా ఉపయోగించి పరిశ్రమలపై కొరఢా ఝళిపించనున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8823
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author