లక్ష్యాలను చేరుకుంటున్న మార్కెటింగ్ శాఖ

లక్ష్యాలను చేరుకుంటున్న మార్కెటింగ్ శాఖ
November 24 15:24 2017
ఖమ్మం,
 మార్కెటింగ్‌శాఖ టార్గెట్‌కు అనుగూణంగా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం కనపడుతుంది.  2017-18 సంవత్సరానికి గాను  జిల్లా మార్కెటింగ్ శాఖ రూ. 29.49 కోట్ల ఆదాయాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. గడిచిన ఐదు నెలలుగా మార్కెట్‌లో ఆదాయం రూ. 10.93 కోట్లుగా ఉంది. రానున్న నాలుగు నెలల్లో మిగిలిన సుమారు రూ. 19 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తికి ఒకేసారి చివరిలో ఒక శాతం చొప్పున మార్కెట్లకు ఫీజు చెల్లించనున్నారు. ఈ సంవత్సరం ఖమ్మం మార్కెట్ టార్గెట్ రూ. 16.75 కోట్లు కాగా నేటి వరకు 6.53 కోట్లు, మధిరకు రూ. 2.52 కోట్లు కాగా నేటి వరకు రూ. 92.15 లక్షలు, నేలకొండపల్లికి రూ. 2.25 కోట్లు కాగా నేటి వరకు రూ. 1.55 కోట్లు, కల్లూరుకు రూ. 2.09 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 38.92 లక్షలు, వైరాకు రూ. 1.92 కోట్లు కాగా నేటి వరకు రూ. 73.33 లక్షలు, ఏన్కూర్‌కు రూ. 2.12 కోట్లు కాగా నేటి వరకు రూ. 39.60 లక్షలు, సత్తుపల్లికు రూ. 1.84 కోట్లు కాగా నేటి వరకు 40.68 లక్షలు చొప్పున ఆదాయాన్ని సమకూరింది.మార్కెట్లు టార్గెట్‌ను చేరుకోవాలనుకుంటే రానున్న నాలుగు నెలలే కీలకం. ప్రస్తుతం ఆయా వ్యవసాయ మార్కెట్లతో పాటు జిన్నింగు మిల్లుల వద్ద పత్తి కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం అయ్యింది. జనవరి నెల చివరి వరకు మార్కెట్లకు భారీగానే పత్తి పంట వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఖరీఫ్‌లో సాగు చేసిన అపరాలు సైతం మార్కెట్‌కు వస్తాయి. ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి ఏప్రిల్ వరకు మిర్చి వస్తుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చితో పాటు ఏప్రిల్ నెలలో మార్కెట్లకు పత్తి, మిర్చి పంటలు పోటెత్తనున్నాయి. తద్వార మార్కెట్లతో పాటు చెక్‌పోస్టులకు సైతం భారీగా ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఖమ్మం, మార్కెట్‌లో మాత్రమే మిర్చి కొనుగోళ్ల ప్రక్రియ జరుగతుంది. మిగిలిన మార్కెట్లకు ధాన్యం, మక్కజొన్న, ఇతర అపరాల కొనుగోళ్ల కేంద్రాల ద్వారానే అదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఆయా మార్కెట్ల పరిధిలో చెక్‌పోస్టుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8826
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author