పీక్ స్టేజ్ కు చేరుకున్న పద్మావతి వివాదం

 పీక్ స్టేజ్ కు చేరుకున్న పద్మావతి వివాదం
November 24 15:56 2017
హైద్రాబాద్,
పద్మావతి సినిమా రిలీజ్ వివాదం పీక్ స్థాయికి చేరింది. ఆ చిత్రం విడుదల చేయొద్దంటూ.. ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలోని ప్రసిద్ద నహర్‌గఢ్ కోటలో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహం పక్కన రాళ్లపై పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా బెదిరింపు రాతలు ఉన్నాయి. ‘పద్మావతి.. మేం కేవలం దిష్టి బొమ్మలను ఉరి తీయడంతోనే సరిపెట్టం..’ అంటూ కోటలోని రాళ్లపై రాసిపెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దానిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు తనకు తాను ఉరి వేసుకున్నాడా.. లేదా ఎవరైనా హత్య చేసి అక్కడ వేలాడదీశారా అనే విషయం తేలాల్సి ఉంది.రాజస్థాన్‌లోని నహర్‌గఢ్ కోటకు పర్యాటకంగా బాగా గుర్తింపు ఉంది. జైపూర్ శివార్లలో ఉండే ఈ కోటకు ఓ దిక్కున  ఉదయం యువకుడి మృతదేహం వేలాడుతూ ఉండటం చూసి.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక కావ్యం ‘పద్మావతి’ రిలీజ్‌కు బ్రిటన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. సినిమా విడుదలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఆ యువకుడి మృతి ఉదంతంతో తమకేం సంబంధంలేదని రాజ్‌పుత్ కర్ణిసేన ప్రకటించింది. డిసెంబర్ 1న పద్మావతి విడుదలకు రంగం సిద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో.. వారు ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. చిత్తోఢ్ ప్రాంతానికి గర్వకారణమైన రాణి పద్మిని గురించి తక్కువ చేసి చూపారనే ఆరోపణలతో సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న కర్ణిసేన కార్యకర్తలు.. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8841
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author