డిసెంబర్ 21న ఆర్కే నగర్ ఎలక్షన్

డిసెంబర్ 21న ఆర్కే నగర్ ఎలక్షన్
November 24 16:13 2017
న్యూఢిల్లీ,
చెన్నైలోని ఆర్కేనగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్‌ ఎట్టకేలకు ఖరారైంది. డిసెంబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపింది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు డిసెంబర్ 4గా పేర్కొంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్కేనగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఓసారి ఉపఎన్నికకు సిద్ధమైన ఈసీ.. పెద్ద ఎత్తున డబ్బులు పంచి, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఆధారాలు లభించడంతో షెడ్యూల్‌ను రద్దు చేసింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు డిసెంబర్‌ 31లోగా ఆర్కేనగర్‌ ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఈసీ తాజాగా శుక్రవారం  షెడ్యూల్‌ను విడుదల చేసింది. పళనిస్వామి-పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య నెలకొన్న రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8847
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author