అమరావతిలో ఐటీ

అమరావతిలో ఐటీ
November 25 11:38 2017
గుంటూరు,
ఏ రంగంలోనైనా రెండు లక్షల ఉద్యోగాలు సృష్టించడం అంటే మాటలు కాదు. ఆ టార్గెట్ ను చేరుకునేందుకు భారీ కసరత్తు చేయాలి. నైపుణ్యవంతమైన వనరులను తయారు చేయాలి ఇప్పుడిదే పనిలో ఉన్నారు యువ మంత్రి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని విస్తృతం చేసి.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నారు.రాష్ట్రాభివృద్ధే జీవిత ధ్యేయంగా అద్భుత విధానాలతో ముందడుగేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని రంగాలనూ ప్రగతిపథంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నారు. ఆయన లక్ష్యంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు ఐటీ మంత్రి నారా లోకేశ్. తండ్రికి తగ్గ తనయుడిగా చురుగ్గా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని పటిష్టం చేసేందుకు యత్నిస్తున్నారు. యువ మంత్రి కృషి వల్ల ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. సంస్థలు ప్రారంభించి యువతకు ఉపాధి కల్పించాయి. ఈ అవకాశాలను మరింత విస్తృతం చేసే దిశగా లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు.  రాష్ట్రానికి ప్రముఖ ఐటీ సంస్థలను తీసుకొచ్చేందుకు లోకేశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన శ్రమం సత్ఫలితాన్నిస్తోంది. ఇప్పటికే గన్నవరంలోని మేధాటవర్స్ లో పలు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా వందల మంది ఉద్యోగాలు లభించాయి. ఇక ప్రభుత్వ పాలసీలు ప్రోత్సాహకరంగా ఉండడంతో పలు సంస్థలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. దీంతో మేధా టవర్స్ లో చోటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మరో టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఈ నిర్మాణానికి భూమి పూజ చేసిన లోకేశ్ ఐటీ రంగంపై తమ విధానాలను వివరించారు. రాష్ట్రంలో ఐటీ వెలుగులు ప్రారంభమయ్యాయిని చెప్పారు.ఏడాదిన్నర కాలంలో ఐటీ రంగంలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు లోకేశ్‌. వాస్తవానికి విజయవాడ సమీపంలో చాలా కాలం క్రితమే ఐటీ పార్కు ప్రారంభమైంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గణనీయమైన మార్పు వచ్చింది. 8 నెలల నుంచి పలు సంస్థలు కార్యకలపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. దీంతో వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర విభజన సమయంలో దేశంలో 10 సెల్‌ఫోన్‌లు తయారవుతుంటే.. మన రాష్ట్రంలో ఒక్క ఫోను తయారు కాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, సీఎం చంద్రబాబు ప్రారంభించిన మేడ్‌ ఇన్‌ ఆంధ్రా వల్ల రాష్ట్రంలో కార్బన్‌, సెల్‌కాన్‌, ఫోక్సాకాన్‌ కంపెనీలు వచ్చాయని లోకేశ్ వివరించారు. ఫోక్సాకాన్‌లో 12 వేల మంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారని, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి చూపడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంస్థల ఏర్పాటు వల్ల దేశంలో తయారవుతున్న 10 సెల్‌ఫోన్‌లలో రెండు ఫోన్లు మన రాష్ట్రంలోనే తయారవుతున్నట్లు వివరించారు. ఇక భూమి పూజ చేసిన రెండో భవనం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ బిల్డింగ్ ఆరు నెలల్లోనే పూర్తవుతుంది.  దీంతో త్వరితగతిన సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.రాష్ట్ర విభజన నాటికి ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విజయవాడ, వైజాగ్‌లలో వేళ్లపై లెక్కించే స్థాయిలో ఐటీ కంపెనీలు ఉండేవి. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలకు.. రాష్ట్ర ప్రగతికి ఒక బ్రాండ్‌గా మారారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన్ను చూసే పెట్టుబడిదారులు నవ్యాంధ్రపై ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు సైతం క్యూ కడుతున్నాయి. తండ్రిలానే లోకేశ్ సైతం ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సుదీర్ఘ కాలం ఖాళీగా ఉన్న మేధా టవర్స్‌కు నెలల వ్యవధిలో అనేక ఐటీ కంపెనీలు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.  ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పరంగా విశాఖపట్నం ముందంజలో ఉంది. ఐటీ అభివృద్ధిని విశాఖకే పరిమితం చేయడంలో రాష్ట్రంలోని ప్రముఖ నగరాలకూ తీసుకురావాలన్నది మంత్రి లోకేశ్ అభిమతం. ఈ మేరకు అమరావతి, తిరుపతి పట్టణాలపైనా దృష్టి సారించి.. ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే ఫిన్‌టెక్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తంగా మూడు పట్టణాల్లోనూ కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కులను నిర్మించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు లోకేశ్.విజయవాడలో నిర్మితమవుతున్న నూతన ఐటీ టవర్‌ ద్వారా 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గన్నవరం ఐటీ పార్కులో మొత్తం 30 వేల ఉద్యోగాలు కల్పించాలని లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో 13 వేల ఐటీ ఉద్యోగాలు కల్పించారు.  ఈ రంగంలో ఉద్యోగ కల్పన ఇటీవలిగా ఊపందుకుంది. దీంతో లోకేశ్ తన టార్గెట్స్ అతి త్వరలోనే చేరుకుంటారన్న విశ్వాసం పార్టీ వర్గాల్లోనే కాక ఉద్యోగార్ధుల్లోనూ నెలకొంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8857
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author