ఏపీలో పంచాయితీ ఎన్నికల హడావిడి

 ఏపీలో పంచాయితీ ఎన్నికల హడావిడి
November 25 14:01 2017
విజయవాడ,,
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనునిత్యం సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో అమీతుమీ తేల్చుకుంటున్నారు… ఇక జనసేన కథేంటో ఇంకా క్లారిటీ రావడం లేదు..ఇదీ ఏపీలో ప్రస్తుతం పైకి కనిపిస్తున్న రాజకీయ స్థితి. ఇప్పుడు మరింత ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే… త్వరలోనే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలు కానుంది. మరి ఎన్నికలు ఎప్పుడో 2019లో కదా.. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కనీసం ఒకటిన్నర సంవత్సరం సమయం ఉంది కదా.. అనే సందేహం రావొచ్చు. అయితే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏడాది ముందే.. ఏపీలో ఎన్నికల రచ్చ మొదలు కానుంది. ఇదంతా స్థానిక ఎన్నికల వ్యవహారం.వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ నుంచినే ఏపీలో ఎన్నికల ఘట్టం మొదలు కానుంది. ముందుగా పంచాయతీ ప్రెసిడెంట్ పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీలకు ఎన్నిలు జరిగాయి. త్వరలోనే ప్రెసిడెంట్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలు కచ్చితంగా జరగాల్సి ఉంది. వాయిదాలు ఏమీ లేకుండా చంద్రబాబు ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయిపంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు. అయినప్పటికీ.. పార్టీల ప్రమేయం కొంత వరకూ ఉండనే ఉంటుంది. ఇవి మాత్రమే కాదు.. పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కూడా జరగనున్నాయి. అవే.. స్థానిక సంస్థల ఎన్నికలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ చైర్మన్ ల ఎన్నికలు కూడా వచ్చే ఏడాదిలోనే జరిగే అవకాశం ఉంది. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా క్యూలో ఉన్నాయి. వీటన్నింటికీ ఎన్నికలు గత సార్వత్రిక ఎన్నికల ముందు జరిగాయి. ఐదేళ్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాదిలో వీటన్నింటి ఎన్నికలూ జరగాల్సి ఉంది.సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే జరగనున్న ఈ ఎన్నికలు అన్నీ ఏపీలో పొలిటికల్ హీట్ ను రేపనున్నాయి. మరి కొన్ని నెలల్లోనే వీటి హడావుడి మొదలుకానుంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఇందుకు సంబంధించి నేతలు, కార్యకర్తల మధ్య చర్చలు మొదలయ్యాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8894
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author