‘డబుల్‌’ పనులకు తొలగిన స్థల సమస్య

‘డబుల్‌’ పనులకు తొలగిన స్థల సమస్య
November 25 17:17 2017
కరీంనగర్,
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ ఒకటి. కరీంనగర్ ప్రాంతంలో స్థలాభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ పథకానికి ఇప్పుడు సమస్యలు తొలగిపోయాయి. దీంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. జిల్లాకు 5,284 రెండు పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయి. 4,284 ఇళ్లకు టెండర్లు పిలిచారు. 1138 ఇళ్ల నిర్మాణం ప్రారంభంకాగా 229 మాత్రమే పూర్తయ్యాయి. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ సమస్య ఎట్టకేలకు తీరిపోనుంది. స్థలాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడంతో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లకు సైతం నిర్దేశకాలు జారీచేశారు. గతంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ప్రోత్సాహకంగా లేదంటూ కొందరు కాంట్రాక్టర్లు వెనకడుగేశారు. టెండర్లలో సైతం పాల్గొనలేదు. దీంతో టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగి ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటూ కంకర, సిమెంట్ విషయంలోనూ మద్దతుగా ఉంటామని చెప్పారు. దీంతో పలువురు టెండర్లలో ఉత్సాహంగానే పాల్గొన్నారు. అయితే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థలాల గుర్తింపు, సేకరణ కొంత ఇబ్బందిగా మారింది. దీంతో పలు గృహాల నిర్మాణానికి శంకుస్థాపనే జరగని పరిస్థితి.
 కరీంనగర్‌ నియోజకవర్గానికి పట్టణ కోటా కింద 660, గ్రామీణ కోటా కింద 740 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో పట్టణ కోటా ఇళ్ల నిర్మాణాలకు గానూ ఏడాది నుంచి భూ సేకరణ సమస్యగా ఉంది. డెయిరీ స్థలం కేటాయించినా అభ్యంతరాలు వచ్చాయి. చివరకు డెయిరీకి చెందిన పది ఎకరాల భూమిని ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణానికి కేటాయించింది. ఇందులో 8 ఎకరాల్లో జీ+2 పద్ధతిలో పట్టణ ప్రాంత ఇళ్లను నిర్మించనున్నారు. మిగిలిన రెండు ఎకరాలను షాదీఖానా, అంబేద్కర్‌ భవన్‌లు నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 5284 ఇళ్లలో టెండర్లు పిలిచిన వాటిలో 2284 ఇళ్లను ఇంకా ప్రారంభించాల్సి ఉంది. వీటిలో దాదాపు అన్నింటికీ గుత్తేదారులతో ఒప్పందాలు పూర్తికావడంతో నిర్మాణాలు ప్రారంభింపజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టెండర్లు పిలవని వెయ్యి ఇళ్లకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని, జనవరి నాటికి పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభింపజేస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామని వివరించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8929
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author