మెట్రో ఘనత కాంగ్రెస్ దే : టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్

 మెట్రో ఘనత కాంగ్రెస్ దే : టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్
November 25 17:56 2017
హైదరాబాద్,
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రతిపాదించి, డిజైన్లను రూపొందించి మంజూరు చేసి, పనులను ముందుకు తీసుకుపోయింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ  మెట్రో రైల్ ప్రాజెక్టు హైదరాబాద్ కు రావడానికి  ప్రధాని నరేంద్రమోడీ కానీ, ముఖ్యమంత్రి కేసిఆర్ల పాత్ర కానీ ఏమి లేదని అన్నారు.   ఇప్పుడు మెట్రో రైలు ప్రారంభించడం ద్వారా ఈ ఘనత అంతా తమదేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని తప్పు పట్టారు.  వాస్తవానికి కేసిఆర్ గతంలో చేసిన అలైన్మెంట్ మార్పు ప్రతిపాదనలతో  ఈరోజుకి మూడేళ్ళ పాటు మెట్రో రైలు జాప్యం జరిగిందని ఉత్తమ్ విమర్శించారు. దీంతో దాదాపు , 3,500 కోట్ల అదనపు భారం పడింది. చివరకు కేసిఆర్ అధికారంలోకి వచ్చాక గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారమే పనులు చేశారని అయన అన్నారు. నిజానికి కేసిఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క కి.మీ కూడా అదనంగా చేపట్టలేదు, పాత బస్తీలో పనులు ఇంకా మొదలే కాలేదు. మెట్రో రైల్ పై సమగ్ర అంశాలతో  ఆదివారం నాడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ వుంటుందని ఉత్తమ్ ప్రకటనలో పేర్కోన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8947
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author