మెట్రో స్టేషన్ లో అడగుడుగునా సీసీకెమెరాలు

మెట్రో స్టేషన్ లో అడగుడుగునా సీసీకెమెరాలు
November 25 18:15 2017
హైద్రాబాద్,
మెట్రో రైల్ నిర్వహణ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజానంతో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. ఆయా స్టేషన్లకు కావాల్సిన పూర్తి బందోబస్తును మూడు కమిషనరేట్ పోలీసులు చూసుకుండగా, మెట్రో సంస్థ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా సమకూరుస్తున్నది. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసు విభాగం నేతృత్వంలో పనిచేస్తారు. ప్రస్తుతం ప్రారంభంకానున్న నాగోల్ నుంచి మియాపూర్ రూట్‌లో 546 ప్రైవేట్ సెక్యూరిటీని హెచ్‌ఎంఆర్‌ఎల్ పోలీసు విభాగం నేతృత్వంలో పనిచేసేందుకు నియమిస్తున్నది. ఒకో మెట్రో స్టేషన్‌లో అత్యాధునిక హైఎండెడ్ సీసీ కెమెరాలు 360 డిగ్రీలు తిరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఒకో స్టేషన్‌లో సుమారు 70 నుంచి 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆయా స్టేషన్‌లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్(డీఎంఎఫ్‌డీ), హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్(హెచ్‌హెచ్‌ఎండీ) తదితర పరికరాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8957
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author