మోదీ ప్రభుత్వం చర్యలను ప్రశంసించిన ఎస్అండ్పీ

మోదీ ప్రభుత్వం చర్యలను ప్రశంసించిన ఎస్అండ్పీ
November 25 18:30 2017
న్యూఢిల్లీ
ప్రముఖ రేటింగ్ సంస్థ స్టాండర్డ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను ప్రశంసించింది. భారతదేశంపై ఔట్‌లుక్‌ నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఆర్థిక ఏకీకరణకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందని తెలిపింది. సంస్కరణల అమలు పట్ల సానుకూలత వ్యక్తం చేసింది. రాబోయే రెండేళ్ళలో వృద్ధి పుంజుకుంటుందని తెలిపింది.భారతదేశం రేటింగ్‌ను ఎస్ అండ్ పీ చివరిసారి 2007 జనవరిలో బీబీబీ-మైనస్‌కు మార్చింది. బాండ్ల కోసం ఇది అత్యంత తక్కువ స్థాయి ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్. ఔట్‌లుక్‌ను స్టేబుల్  (నిలకడ)గా పేర్కొంది. 2009లో ఔట్‌‌లుక్‌ను నెగెటివ్ కు మార్చింది. దీనిని 2010లో స్టేబుల్ కు పెంచింది. 2012లో మళ్ళీ ఔట్‌లుక్‌ను నెగెటివ్‌ కు తగ్గించింది.2014లో మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దీనిని మళ్ళీ స్టేబుల్ కు పెంచింది. ఈ రేటింగ్‌ను తాజాగా యథాతథంగా కొనసాగిస్తోంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8966
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author