రుణం కోసం రణం..

 రుణం కోసం రణం..
November 27 10:45 2017
నిజామాబాద్,
పెద్దనోట్ల రద్దు వ్యవహారం రైతులపై తీవ్రప్రభావం చూపుతోంది. రూ.500, రూ.1000నోట్లను రద్దు చేయడంతో ఇప్పటికే సామాన్య ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతుండగా.. ప్రస్తుతం రైతులు సైతం బ్యాంకు రుణాల కోసం ముప్పతిప్పలు పడుతున్నారు.వానకాలంలో కురిసిన వర్షాలతో ఈ సారి యాసంగి పంటల సాగుపై జిల్లా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పంటల సాగు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని అప్పుకోసం
బ్యాంకులకు వెళ్తే అక్కడ రైతులకు రుణాలు ఇవ్వడం లేదు.
రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం రూ.25వేల వరకు డబ్బులు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రైతులు ఎకరా భూమిలో పంటలు సాగు చేయాలంటే కనీసం రూ.40వేలు ఖర్చు అవుతుంది.బ్యాంకుల నుంచి ఇచ్చే రూ.25వేలు ఏ మాత్రం సరిపోవడం లేదని అన్నదాతలు అంటున్నారు. యాసంగి పంటలు సాగు చేయాలంటే దుక్కిదున్నడం, కూలీలు, విత్తనాల కొనుగోలు ఇతర ఖర్చులకు ప్రస్తుతం బ్యాంకు ద్వారా ఇస్తున్న డబ్బులను రూ.60వేల వరకు మినహాయింపు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
వానకాలం పంటల సీజన్ ముగియగా.. యాసంగి పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటల సాగు విషయంలో బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కర్షకులకు కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. సాగు ఖర్చులకు బ్యాంకులకు వెళితే సిబ్బంది అంతా నగదు మార్పిడి పనుల్లో బిజీబిజీ.. ధాన్యం అమ్మగా చెక్కులు ఇచ్చారు. వాటిని నగదుగా మార్చుకొనేందుకు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి.
జిల్లాలో అత్యధిక రైతులు పత్తి, శనగ పంటలు సాగు చేస్తారు.పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు నోట్ల మార్పిడి ఖాతాలో నగదు జమ చేసేందుకు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. దీంతో బ్యాంకు సిబ్బంది పెద్దనోట్ల వ్యవహారంలో బిజీగా ఉంటు నగదు మార్పిడితో పాటు వారి వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. బ్యాంకు ద్వారా రైతులకు రూ.20వేలు ఇస్తున్నా వీటి కోసం గంటల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది.
ఈ సీజన్‌లో పంటల సాగు పంట ఉత్పత్తుల సేకరణ కారణంగా రైతులకు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి అవసరమైన డబ్బులు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సీజన్‌లో బ్యాంకు రుణాలు సకాలంలో అందక రైతులకు పెట్టబడులు లభించక.. పంటల సాగు ఘననీయంగా తగ్గే అవకాశాలున్నాయి.పంటలు వేసేందుకు అప్పులు ఇవ్వాలని రైతులు బ్యాంకు అధికారులను కోరినా ప్రస్తుతం నగదు మార్పిడి జరుగుతున్నందున పెద్దనోట్ల వ్యవహారంలో తాము బిజీగా ఉన్నామని.. ఇప్పుడు రుణాలు ఇవ్వడం వీలు కాదని బ్యాంకర్లు అంటున్నారు.
రైతులు వానకాలంలో సాగు చేసిన పంటలను విక్రయించగా.. వ్యాపారులు చెక్కులు ఇచ్చారు. ఓ వైపు చెక్కులు.. మరో వైపు బ్యాంకు అధికారులు రుణాలివ్వక పోవడంతో రైతులు యాసంగి పంటల సాగు కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9041
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author