గ్రామాల్లో విలేజ్ మాల్స్

గ్రామాల్లో విలేజ్ మాల్స్
November 27 12:34 2017
అనంతపురం,
 రేషన్‌ దుకాణాలు ఇక కిరాణా షాపులుగా, మినీ సూపర్‌ మార్కెట్లుగా మారనున్నాయి. వినియోగదారులకు బియ్యం, కిరోసిన్‌, పంచదారతోపాటు అన్ని సరుకులు అందించడానికి రేషన్‌ దుకాణాల రూపు రేఖలను మార్చే
ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. బయటి కిరాణా షాపుల కన్నా తక్కువ రేట్లకే రేషన్‌ షాపుల్లో సరుకులు అమ్మటం వల్ల డీలర్‌కు ఆదాయంతో పాటు వినియోగదారుకీ ఆదా అవుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.
చౌక ధరల దుకాణాలు ‘విలేజ్‌ మాల్స్‌’గా పరిగణిస్తూ, అన్ని రకాల సరుకులు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఇన్‌చార్జి కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, చక్కెర, కిరోసిన్‌తో పాటు కందిపప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, సబ్బులు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశలో కొంత కాలం ప్రయోగాత్మకంగా నిర్వహించిన ‘విలేజ్‌మాల్స్‌’ పథకాన్ని తిరిగి తెరపైకి తీసుకువచ్చే దిశగా పౌరసరఫరాల శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. కార్డుదారులకు ప్రజాపంపిణీ సరుకులను సరఫరా చేస్తూనే ఇతర సరుకులు విక్రయించాలన్నదే ‘విలేజ్‌మాల్స్‌’ లక్ష్యం.
సబ్బులు, పప్పులు, పాలు, నూనెలు, ఉప్పు, బెల్లం, ఉల్లిగడ్డలు తదితర అన్ని రకాల సరుకులు అమ్ముకునే అవకాశం ఈ మాల్స్‌లో ఉంటుంది. వీటితో పాటు ఎల్‌ఐసీ పాలసీ చెల్లింపులు, చిన్నమొత్తాల పొదుపు బాండ్లు, సెల్‌ఫోన, డిష్‌ రీచార్జ్‌ లాంటివీ విక్రయించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే, డోర్‌ డెలివరీపైనా దృష్టి పెడుతున్నారు. పెద్దమొత్తంలో సరుకులు కొనే వారికి, ఒక్క ఫోన కాల్‌తో సరుకులను ప్యాక్‌ చేసుకుని డీలరే ఇంటికి వెళ్లి ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నారు. రేషనషాపుల్లో ఇతర సరుకులు అమ్ముకోవాలనే ఆలోచన ఉన్న డీలర్లును ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తుంది.
రేషన షాపుల కోసం కొనుగోలు చేసే సరుకులు నేరుగా పరిశ్రమల నుంచి కొంటాం. దీనివల్ల 10 నుంచి 15 శాతం తక్కువ ధరకే సరుకులు వస్తాయి. అప్పుడు బయట షాపుల కన్నా రెండు
రూపాయిలు తక్కువకు నాణ్యమైన సరుకును వినియోగదారుకు అందించవచ్చు. రేషన దుకాణాలకు అన్ని రకాల సరుకులను పంపిణీ చేయడానికి కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. దీని వల్ల ప్రభుత్వం ఇచ్చే కమీషన
సరిపోవడం లేదని ఇబ్బందులు పడుతున్న డీలర్లకు ఈ అమ్మకాలతో కొంత ఆదాయం సమకూరుతుంది బ్యాంకర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి చౌక దుకాణానికి ఓవర్‌ డ్రాఫ్ట్‌
సౌకర్యాన్ని ఇవ్వాలని లక్ష్మీకాంతం బ్యాంకర్లకు సూచించారు. డీలర్లను బిజినెస్‌ కరస్పాండెంట్లుగా నియమించాలన్నారు. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) యంత్రాల వినియోగం, ఆన్‌లైన్‌ లావాదేవీలుపై గురువారం డివిజన్‌
వారీగా ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓలకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వాలన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9047
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author