గ్రామాల రహదారులను మింగేసున్న  షిప్పింగ్ కంపెనీ

గ్రామాల రహదారులను మింగేసున్న  షిప్పింగ్ కంపెనీ
November 27 13:08 2017
విశాఖపట్టణం,
గుడినే గుడిలో లింగాన్ని మింగేసే రకం తయారయింది.విశాఖ నగర శివారులోని మింది గ్రామపరిధిలో దాదాపు 15 ఏళ్ల క్రితం శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ… ఏకంగా రహదారినే మింగేసింది. 15 నుంచి 22/8 సర్వే నెంబర్ లలో
10 ఎకరాలకు పైగా శ్రావణ్ షిప్పింగ్ భూమి ఉంది. ఈ భూమిని ఆనుకొని మింధి గ్రామానికి చెందిన 60 అడుగుల రోడ్డు, స్మశానం, అమ్మవారి దేవస్థాన స్థలం, గ్రామ రెవెన్యూ భూమి, జీవీఎంసీ భూములు ఉన్నాయి.
అయితే క్రమక్రమంగా ఈ భూములను శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఆక్రమించుకొని కంపెనీకి చెందిన కంటైనర్లు, భారీ వాహనాలను పార్కింగ్ చేసుకొనేందుకు ఉపయోగించుకుంటోంది.కంపెనీ తీరును గ్రామస్తులు తీవ్రంగా
తప్పుపడుతున్నారు. గతంలో ఆరేళ్ల క్రితం కూడా మింధి గ్రామస్తులకు, శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యం మధ్య ఈ రోడ్డుకు సంబంధించిన వివాదం చోటుచేసుకుంది. గ్రామస్తులంతా ఆందోళనకు దిగడంతో తమకు రోడ్డు
కావాలని 60 అడుగుల రోడ్డును కంపెనీకి ఇస్తే ప్రత్యామ్నాయంగా మరో రోడ్డును గ్రామస్తులకు ఇస్తామని పెద్దమనుఘుల ముందు ఒప్పందం చేసుకొంది. దీంతో అప్పట్లో ఈ వివాదం సద్దుమణిగింది.
పెద్దమనుఘల ముందు చేసుకొన్న ఒప్పందాన్ని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఉల్లంఘించి వివాదానికి కారణమైన రోడ్డును, ప్రత్యామ్నాయంగా ఇచ్చిన రోడ్డును రెండింటిని పూర్తిగా మూసేసింది. దీంతో గ్రామస్తులు తిరిగి
ఉద్యమబాట పట్టారు. కంపెనీ తీరుపై కన్నెర్ర చేసిన తమపై పోలీసుల సహాయంతో అక్రమకేసులు పెట్టి కంపెనీ యాజమాన్యం వేధిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మింది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను కలిసి రహదారితో
పాటుగా అనేక ప్రభుత్వ, పోర్టుకు చెందిన భూములను సదరు షిప్పింగ్ కంపెనీ ఆక్రమించుకుందని ఫిర్యాదు చేసారు. దీనిపై స్ధానిక ఎమ్మెల్యే స్పందించారు. గ్రామస్తులు, పోర్టు, జీవీఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యను
త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.ఇదీలా ఉంటే మరో వైపు కంపెనీ వినిపిస్తున్న వాదన పూర్తి భిన్నంగా ఉంది. తాము వచ్చిన తర్వాతే ఇక్కడ రోడ్డు వేశారన్నారు.
పోర్ట్ క్లియరెన్స్ వస్తే ప్రజలకు సెఫ్టీతో కూడిన రోడ్డు వస్తోందని చెబుతున్నారు. తమపై కొంతమది కావాలనే విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరీ ప్రభుత్వం, అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలంటే వేచి చూడాల్సిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9056
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author