నీటి సంరక్షణే ధ్యేయం

November 28 00:49 2017
ఖమ్మం,
ఖమ్మం జిల్లాలో ప్రవహించే ఆకేరు, మున్నేరు నదులు, పాలేరు వాగులు దృష్టిలో ఉంచుకొని బ్రిడ్జి కం చెక్‌డ్యాంల నిర్మాణం చేపడుతున్నారు. భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా గతంలో వీటిని నిర్మించాలని సంకల్పించారు. వీటిలో నిత్యం నీరు నిల్వ ఉంటుందని, బావులు, బోర్లు రీఛార్జి అవుతాయి. అయితే వర్షాకాలం వస్తే కొన్ని ప్రాంతాల మధ్య రోడ్డు అనుసంధానం తెగిపోతోంది. రోడ్డు మార్గం నుంచే నది ప్రవాహం ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి బ్రిడ్జి కం చెక్‌డ్యాంల నిర్మాణం తెరమీదకు వచ్చింది. రూ.95 కోట్లతో జిల్లాలో బ్రిడ్జి కం చెక్‌డ్యాంల నిర్మాణాలను చేపడుతున్నారు. దీనికి సంబంధించిన ఈ ఏడాది ఆగస్టు 31న ప్రభుత్వ ఉత్తర్వు 500 వెలువడింది. నది ప్రవాహాలు ప్రవహించే ప్రాంతాల్లో రోడ్లు ఉన్న మార్గాల్లో వీటిని నిర్మిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. సంబంధిత నిర్మాణాలకు సంబంధించిన వ్యయాన్ని సైతం నిర్దేశించారు. చెక్ డ్యాంలతో బహుళ ప్రయోజనాలుంటాయి. భూగర్భజలాలు పెరగడం ద్వారా సమీపంలోని బోర్లు, బావులు రీఛార్జి అవుతాయి.
 చెక్‌డ్యాం నిర్మాణంతో పలు ప్రాంతాల మధ్య దూరాభారం తగ్గిపోతుంది. రైతులకూ విస్తృత ప్రయోజనాలు ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం అధికంగా ఉంటుందన్న ప్రాంతంలోనే చెక్ డ్యాంలు ఏర్పాటు చేస్తుండడంతో దుబారా ఖర్చుకు ఆస్కారం ఉండదు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉండదు. భూమిలోనికి ఇంకిపోతుంది. అలాంటి చోట్ల వీటిని నిర్మించడంలేదు. వర్షం నీరు ఎక్కువగా నిల్వ ఉండి, ఎక్కువ శాతం నీరు నిల్వ ఉంటుందని పరీక్షల్లో తేలితేనే నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం చేపట్టనున్న చెక్ డ్యాంలు భవిష్యత్తులో వాననీటి నిల్వకు సహకరించనున్నాయి. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంటే వర్షాలతో సంబంధం లేకుండా ఈ చెక్‌డ్యాంలలో నీటిని నిల్వ చేసుకొనే వీలుంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈలోపుగానే పలు చోట్ల బ్రిడ్జి కం చెక్‌డ్యాంలు నిర్మించుకుంటే ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రాంతీయంగా జల సంరక్షణకోసం ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తున్న కృషిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9114
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author