గురు జగ్గీదేవ్ తో ఎంపి కవిత భేటీ

గురు జగ్గీదేవ్ తో ఎంపి కవిత భేటీ
November 28 00:55 2017
హైదరాబాద్,
లింగ భేదం చూపించకుండా అంతా మనుషులమేనన్న భావన కలిగితే సమాజం గొప్పగా తయారవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీవాసుదేవ్ అన్నారు. హైదరాబాద్లోని పార్క్  హోటల్లో ఫిక్కీ సంస్థ నిర్వహించిన నాయకత్వంలో మహిళా సాధికారత సదస్సును నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి ఆయన ప్రారంభించారు. సద్గురు జగ్గీవాసుదేవ్తో మహిళా సాధికారతపై టీఆర్ఎస్ ఎంపీ కవిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివుడిలోని అర్ధనారీశ్వర తత్వమే మహిళకు ఎంతటి ప్రాధాన్యత ఉందో చెప్పిందని జగ్గీవాసుదేవ్ గుర్తు చేశారు. ఎన్నికల్లో మగ, ఆడ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టవద్దని సూచించారు. గత రెండు దశాబ్దాల్లో  మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. వాళ్లింకా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. సదస్సులో జగ్గీ వాసుదేవ్తో మహిళా సాధికారతపై ఎంపీ కవిత సమగ్ర  వివరాలు తెలుసుకున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9117
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author