హోం గార్డుల వినతిపత్రం

హోం గార్డుల వినతిపత్రం
November 28 01:34 2017
హైదరాబాద్,
హోం గార్డ్స్ నియామకాలు, వారి ఉద్యగాల క్రమబద్దీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, మాజీ సీఎస్ రాజీవ్ శర్మకు తెలంగాణ రాష్ట్ర హోమ్ గార్డ్స్ అసోసియేషన్  ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.  నివేదికలో దేశంలోని వివిధ రాష్ట్రాలలోని హోం గార్డ్స్ లకు వున్న సౌకర్యాలను పొందుపరచారు. అసోసియేషన్  అధ్యక్షుడు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ . ఇతర నాయకులు రాజీవ్ శర్మను కలిసారు.  దీనిపై స్పందించిన రాజీవ్ శర్మ,  నివేదికను పరిశీలించి, హోమ్ గార్డ్స్ కు న్యాయం జరిగేవిధంగా నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందచేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో హోమ్ గార్డ్స్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సైబరాబాద్ అధ్యక్షులు రాజేందర్, ఏడుకొండలు, ప్రమోద్, మధు మరియు తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9135
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author