నిండా మునిగిన అన్నదాత 

నిండా మునిగిన అన్నదాత 
November 28 01:37 2017
ఆదిలాబాద్,
ఖరీప్ లో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. సోయా, పత్తి, వరి ఇలా ప్రధాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. తొలుత సరిపడా వర్షాలు కురవకపోవడం, ఫలితంగా పూత, కాత దెబ్బతినడం, చేతికొచ్చే దశలో అకాల వర్షాల వల్ల తెగుళ్ల దాడితో రైతన్నకు కోలుకోలేని దెబ్బతగిలింది. సగటు దిగుబడిలో సగం కూడా రాకపోవడం, మద్దతుధర పెరగకపోవడంతో అప్పులపాలయ్యే దుస్థితి నెలకొన్నది.
నిర్మల్‌ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు సోయా, పత్తి పంటలను అధికంగా సాగు చేశారు. సోయా పంట పూత, కాత దశలో వర్షాలు కురవకపోవడం, కోత దశలో వర్షాలు కురవడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఒక ఎకరానికి 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడులు వచ్చాయి. ఫలితంగా రైతులకు రూ. 5 నుంచి రూ.7 వేలకు మించి దక్కలేదు. పంట సాగు కోసం విత్తనాలు మొదలుకొని కోతదశవరకు దాదాపు రూ. 10 వేల పెట్టుబడులు పెట్టిన రైతులు, ఒక్కో ఎకరాకు రూ.2 నుంచి రూ.3వేల దాకా నష్టపోయారు.
ఈ ఖరీఫ్ లో రైతులు గంపెడాశతో పత్తి సాగు చేశారు. జూన్‌ మొదటి వారంలో వర్షాలు సమృద్ధిగా కురిసిన్నప్పటికీ ఆ తర్వాత ముఖం చాటేయడంతో పంట ఎదుగుదల నిలిచిపోయింది. తీరా పూత దశలో సెప్టెంబర్‌ మాసంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నేల జాలువారి తెగుళ్లు విజృంభించా యి. కనిపించిన పురుగుల మందునల్లా కొట్టి కాపాడుకున్నారు. కానీ పత్తి తీసే తరుణంలో గులాబీ పురుగు సోకడంతో చేన్లు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది క్వింటాల్‌కు రూ.వెయ్యి మద్దతు ధర తగ్గింది. కూలీల ఖర్చు లు తడిసిమోపెడయ్యాయి. ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి రావడంతో పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొన్నది.
 గతేడాదితో పోలిస్తే ఈ యేడాది వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఖరీఫ్ లో వరి నారు నాటే సమయంలో దా దాపు 20 రోజుల పాటు వర్షాలు ముఖం చాటేయడంతో ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో 40-50 రోజుల వరి నారును నాటాల్సి వచ్చింది. అన్ని రకా ల ఎరువులు సకాలంలో వేసినప్పటికీ గతేడాదితో పోలిస్తే దిగుబడులు సగానికి తగ్గిపోయాయి. తీరా సన్నరకానికి దోమపోటు సోకడంతో ఎనలేని నష్టం వాటిల్లింది.
 గత సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టపోయిన పత్తి రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమాయోజనా కింద నేటికీ పరిహారం అందలేదు. తాజాగా దిగుబడులు తగ్గినందున పంట బీమా వర్తింపజేస్తారా? లేదా? వర్తింపజేసినా ఎప్పటికి అందుతుందనేదానిపై స్పష్టత లేదు. కష్టనష్టాలకోర్చి పండించిన పంటలపై అడవిపందుల దాడి తీవ్రమైంది. ఎకరాల కొద్దీ పంట నష్టం కలిగించాయి. కానీ అటవీశాఖ అధికారులు నమమాత్రంగా సర్వే జరిపి చేతులు దులుపుకుంటున్నా రు తప్ప ఇంత వరకు జిల్లాలో ఏ ఒక్కరైతుకూ పరిహారం అందించలేదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9138
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author