అసెంబ్లీ కి సభ్యుల గైర్హాజరు పై సీఎం

అసెంబ్లీ కి సభ్యుల గైర్హాజరు పై సీఎం
November 28 02:05 2017
అమరావతి,
అసెంబ్లీ సమావేశాలు మొదలైన దగ్గర్నుంచి సభ్యులు అందరూ సక్రమంగా హాజరు కావాలని ముఖ్య మంత్రి చంద్రబాబు ఇప్పటికే చాలా సందర్భాలలో చెప్పారు. ప్రతిపక్షాలు సభకు రాకపోవడంతో మనమే ప్రజాపక్షం గా వ్యవహరించి సమస్యలు పరిష్కారం. చేయాలని సూచించారు.  అయితే సభకు సభ్యుల హాజరు ఆశించిన స్థాయి లో ఉండటం లేదు. సమావేశాలు మొదలైన  మొదట్లో సీఎం అందరూ హాజరు కావాలని గట్టి గా చెప్పారు. అయిన చాలా మంది ఎమ్మెల తీరులో పెద్దగా మార్పు ఉండటం లేదు. కొందరు ఆలస్యంగా రావడం,  మరి కొందరు ఎక్కువగా లాబీలోనే ఉంటున్నారని ముఖ్య మంత్రి దృష్టికి వచ్చింది. నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం జరిగిన సభకు కేవలం కొద్దీ మంది మాత్రమే ఎమ్మెల్యే లు రావడంతో సీఎం తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేసారు.  కొంత మంది మంత్రులను ఎమ్మెల్యేలు ను సీఎం తన ఛాంబర్ కు  పిలిపించుకొని క్లాస్ తీసుకున్నాట్లు సమాచారం.
అసెంబ్లీ కి సభ్యులు హాజరు కావడంపై పూర్తి బాధ్యతలు. విప్ లకు అప్పగించారు.  ప్రతిరోజు ఎంతమంది సభకు వచ్చారు అనే దానిపై రిపోర్ట్ తయారూ చేసి సీఎం కి ఇస్తున్నారు.  అసెంబ్లీ సమావేశాలు అర్థ వంతంగా జరగాలంటే సభ్యులు సమావేశాలకు తప్పని సరిగా హాజరవ్వాలని సూచించారు. ప్రభుత్వం  చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు అసెంబ్లీ ని వేదికగా చేసుకోవాలని సీఎం సూచించారు.  రాబోయే ఎన్నికలలో అన్ని స్థానాలలో టిడిపి జెండా ఎగరేలా ఎమ్మెల్యే లు పని చేయాలని సీఎం అన్నారు ఇంకా  అసెంబ్లీ  సమావేశాలు కేవలం నాలుగు రోజులు మాత్రమే జరగనున్నాయి. మరి ముఖ్య మంత్రి చంద్రబాబు హెచ్చరిక  తర్వాత టిడిపి ఎమ్మెల్యే లు ఎంత వరకు సభకు హాజరు అవుతారో చూడాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9156
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author