మెట్రో వచ్చేసింది…..

మెట్రో వచ్చేసింది…..
November 28 16:28 2017
హైద్రాబాద్,
భాగ్యనగర వాసులు కల నెరవేరింది. ఎన్నో ప్రత్యేకతలు కలబోసుకున్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జాతికి అంకితమిచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మియాపూర్‌ చేరుకున్న ప్రధాని ముందుగా మెట్రో పైలాన్‌ ఆవిష్కరించి అనంతరం మెట్రోరైలును ప్రారంభించారు. మెట్రో స్టేషన్‌ మొదటి అంతస్తుకు చేరుకున్న ప్రధాని ప్రాజెక్టు, టీ-సవారీ యాప్‌, బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భాగ్యనగరవాసుల కలల ప్రాజెక్టు ‘మెట్రో రైలు’కు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ మహత్తర ఘట్టానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన కోటి మంది హైదరాబాద్ వాసుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. పదేళ్ల పాటు రహదారిపై ట్రాఫిక్ వెతలను భరించిన రాజధాని ప్రజల మోము.. మెట్రో సాకారంతో చిరునవ్వుతో వెలిగిపోతోంది. రాజధాని వాసుల దశాబ్ద కాల కల సాకారమై.. బుధవారం  ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు పట్టాలపై పరుగు తీయనుంది.మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మెట్రోను లాంఛనంగా ప్రారంభించిన మోదీ.. అనంతరం తొలి ప్రయాణికుడిగా టికెట్ కొనుగోలు చేసి అందులో ప్రయాణం ప్రారంభించారు. కూకట్‌పల్లి వరకు ఆయన మెట్రో రైలు ప్రయాణించి తిరిగి మియాపూర్ చేరుకోనున్నారు.అయితే రిబ్బన్ కట్ చేసే ముందు మంత్రి కేటీఆర్ దూరంగా నిలబడ్డారు. కేటీఆర్ ఎక్కడున్నారు? దగ్గరకు రావాలని మోదీ సూచించారు. కేటీఆర్ వచ్చిన తర్వాతే రిబ్బన్ కట్ చేశారు. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఉన్నారు. అనంతరం మియాపూర్ స్టేషన్‌లో మోదీ తదితరులు మెట్రోరైల్‌పై ఎల్ అండ్ టీ ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్.. వీక్షించారు.మెట్రో రైలు ఎక్కి కూకట్‌పల్లి వరకు తిరిగి మియాపూర్‌కు చేరుకున్నారు. మెట్రోరైల్లో మోదీ ఉల్లాసంగా కనిపించారు. మోదీకి ఓవైపు గవర్నర్ నరసింహన్ కూర్చోగా రెండోవైపు కేటీఆర్ కూర్చున్నారు. గవర్నర్ పక్కన కేసీఆర్ ఆసీనులయ్యారు. మెట్రో విశేషాలను మోదీకి కేటీఆర్ వివరించారు. తర్వాత రెండో అంతస్తులోని ప్లాట్‌ఫాంకు చేరుకుని మెట్రో రైలు ఎక్కారు. రైలులో ఆయన కూకట్‌పల్లి వరకు వెళ్లి తిరిగి మియాపూర్‌ చేరుకున్నారు..425 ఏళ్ల చారిత్రక హైదరాబాద్ నగర సిగలో మెట్రో మణిహారం చేరింది. గుర్రపు బగ్గీలతో ప్రారంభమైన నగర ప్రస్థానం.. మెట్రో రాకతో సమున్నత శిఖరానికి చేరుకుంది. నగర జనాభా కోటికి, ప్రైవేట్ వ్యక్తిగత వాహనాలు దాదాపు అరకోటికి చేరి నిత్యం ట్రాఫిక్‌‌తో నరక యాతన అనుభవిస్తున్న నగరవాసులకు మెట్రో రాక గొప్ప ఊరట కలిగించనుంది. అత్యాధునిక సాంకేతిక అద్భుతంగా తెలుగువారి మెట్రో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికత, నిర్వహణ నైపుణ్యాలు, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో, దాదాపు 15 లక్షల మందికి రవాణా సేవలందించే విస్తృత ఏర్పాట్లతో హైదరాబాద్‌ మెట్రో పరిపుష్టమైంది.మోదీ వెంట తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌, నాయిని, పద్మారావు, భాజపా నేతలు డా.లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి తదితరులు మెట్రోలో ప్రయాణించారు.మొత్తం 18 రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9271
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author