అనుష్క ఎలా మారిందో చూశారా…

 అనుష్క ఎలా మారిందో చూశారా…
November 29 10:36 2017
దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క.. ‘సైజ్ జీరో’ సినిమా కోసం తన శరీర బరువును పెంచుకొని లావయ్యింది. అనుష్క అంత కష్టపడినా.. సినిమా ఫలితం మాత్రం ఆశించినట్లుగా రాలేదు. ఆ తరువాత ఆమె ఎంతగా బరువు తగ్గడానికి ప్రయత్నించినా కుదర్లేదు. ఆఖరికి రాజమౌళి వంటి దర్శకులు ఆమెను గ్రాఫిక్స్ సహాయంతో సన్నంగా చూపించారు. అయితే లేటెస్ట్‌గా అనుష్క షేర్ చేసిన ఫోటో చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.ఈ బ్యూటీ ఎప్పుడు స్లిమ్ అయిందో తెలియదు కానీ ఆమె షేర్ చేసిన ఫోటోలో చాలా స్లిమ్‌గా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోను తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. ‘మ్యాజిక్ ద్వారా కల నిజమైపోదు. దానికోసం శ్రమించాలి, కృషి చేయాలి’ అంటూ ఒక లైన్ కూడా రాసింది. దీంతో అనుష్క స్లిమ్ అయిందని అందరూ అనుకుంటుంటే.. ఈ ఫోటో ఇప్పటిది కాదని మరికొందరు అంటున్నారు. ఆమె చేసిన పోస్ట్ కూడా కాస్త ఆలోచించాల్సిన విధంగానే ఉంది. అమ్మడు నిజంగానే స్లిమ్ అయిందా..? లేక ఆ రేంజ్‌లో కష్టపడాలని చెబుతోందా? దీనికి అనుష్క క్లారిటీ ఇస్తే బాగుంటుంది. స్వీటీ అభిమానులు మాత్రం ఈ ఫోటోను చూస్తూ తెగ సంతోషపడిపోతున్నారు. ఈ ఫోటోలో స్వీటీ మెరుపుతీగలా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతూ విపరీతంగా షేర్‌ చేస్తుండటంతో ఈ పిక్ వైరల్ అయ్యింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9345
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author