కొరటాల శివ డైరక్షన్ లో అఖిల్  

 కొరటాల శివ డైరక్షన్ లో అఖిల్  
November 29 10:47 2017
అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కె కుమార్ ‘హలో’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. డిసెంబర్‌లో ‘హలో’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగార్జున, అమలతో పాటు సమంత కూడా అతిథి పాత్రలో కనిపించనుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత అఖిల్ ఏ డైరెక్టర్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడా? అనే విషయంలో కొరటాల శివ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అఖిల్ మేనరిజంకు తగ్గట్లుగా కొరటాల ఒక కథను సిద్ధం చేసుకున్నాడట.గతంలో ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమాను నిర్మించిన గిరి ఈ సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కొరటాల.. మహేష్ బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో కలిసి సినిమాలు చేసే అవకాశం ఉందనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు కొరటాల శివ.. అఖిల్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9351
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author