స్కూల్ ఫీజుల పెంపునకు గ్రీన్ సిగ్నల్

స్కూల్ ఫీజుల పెంపునకు గ్రీన్ సిగ్నల్
November 29 15:29 2017
హైద్రాబాద్,
ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసేందుకు మరో ఐదు నెలల సమయముంది…నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ఇంకా ఏడునెలల గడువూ ఉంది. అయినా ప్రయివేటు, కార్పొరేట్‌ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఇప్పుడే నిర్ణయించుకునే అధికారాన్ని పాఠశాల విద్యాశాఖ యాజమాన్యాలకు కల్పించింది. ప్రభుత్వం ఫీజులపై కమిటీ వేసిన నేపథ్యంలో, దాని నివేదిక ఇస్తే ఈ విద్యాసంవత్సరం చివరి వరకైనా స్కూల్‌ ఫీజులపై ఏమైనా నిర్ణయం తీసుకుని, తగ్గిస్తారా..? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు విద్యాశాఖ నిర్ణయం తీవ్ర నిరాశను మిగిల్చింది. రాష్ట్రంలో 12వేల ప్రయివేటు బడులున్నాయి. పాఠశాల అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 1 నుంచి అడ్మిషన్లు తీసుకోవాలి. ఇదే విషయాన్ని ఇటీవల డిప్యూటీసీఎం కడియం శ్రీహరి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జి కిషన్‌ ప్రకటించారు. అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది చెప్పిన కొద్దిరోజులకే ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రయివేటు బడుల్లో ఫీజుల నియంత్రణ కోసం గత విద్యాసంవత్సరం మార్చిలో ప్రొఫెసర్‌ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని వేసింది. అనేక గడువులు మారినా, ఈనెలాఖరులో కమిటీ నివేదిక ఇస్తారని ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ నివేదిక మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నది. అయితే ఈ విద్యాసంవత్సరం ఫీజుల వసూళ్లను నియంత్రించేలా ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. కానీ సమగ్ర అధ్యయనం పేరుతో కమిటీ నివేదికను ఆలస్యం చేస్తున్నది. ఈ సమయంలోనే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజులపై పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం పాఠశాల కమిషన రేట్‌లో ప్రయివేటు యాజమాన్యాలతో అధికారులు సమావేశమయ్యారు. దీనిలో ఫీజుల వసూళ్లపై చర్చ జరిగింది. నివేదిక ఆలస్యం అవుతున్నందున ఫీజులు పెంచుకునేందుకు అవకాశమివ్వాలని యాజమాన్యాలు అడిగినట్టు సమాచారం. దీనికి కమిషనర్‌ అంగీకారం తెలిపినట్టు తెలిసింది. అయితే ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే జీవోలకు అనుగుణంగా ఫీజులు తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు..ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువగా ఉంటే, తగ్గించి సర్కారీ ఉత్తర్వుల మేరకు ఫీజులు తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. దీనికి యాజమాన్యాలు సంతోషంగా అంగీకరించినట్టు సమాచారం. అయితే యాజమాన్యాలు పెంచిన ఫీజులను ప్రభుత్వ జీవోలకు అనుగుణంగా తగ్గిస్తారనేది అనుమా నమే. వచ్చే విద్యాసంవత్సరం ఫీజులపై ఇప్పుడే చర్చించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజులు పెంచొద్దు..ఇప్పుడే నిర్ణయించొద్దు అని చెప్పాల్సిన ఉన్నతాధికారులు ఈ రకమైన హామీలివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9372
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author