లెక్కల్లోనే  వ్యక్తిగత మరుగుదొడ్లు

లెక్కల్లోనే  వ్యక్తిగత మరుగుదొడ్లు
November 29 16:59 2017
ఏలూరు,
గంగవరం మండలం కొత్తాడ గ్రామాన్ని ఒడిఎఫ్ గా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తాడలో 159 వ్యక్తిగత మరుగుదొడ్లు నూతనంగా నిర్మించినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. నిజానికి గ్రామంలో ఇన్ని మరుగుదొడ్లను నిర్మించలేదని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో సూరంపాలెం ప్రాజెక్టు ముంపులో భాగంగా గతంలో 79 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. వీరందరికీ అప్పటి ప్రభుత్వం ఇళ్లతో పాటూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం గ్రామాన్ని ఒడిఎఫ్‌గా ప్రకటించడంతో అధికారుల నూతనంగా ఎలాంటి మరుగుదొడ్లను నిర్మించలేదు. కొంత మంది మాత్రమే నూతనంగా మరుగుదొడ్లను నిర్మించారు. పాత మరుగుదొడ్లకు సున్నం పూసి, అదనంగా నాలుగు తూరలు వేసి కొత్తవాటిగా మెరుగులు దిద్దారు. వీటినే ఒడిఎఫ్‌లో భాగంగా నిర్మించినట్టు చూపి బిల్లులు చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ బిల్లుల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి కాకుండా కాంట్రాక్టరు ఖాతాలోకి జమచేశారని వారంటున్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారుల నుంచి మేస్త్రిలు రూ.3వేల వరకూ వసూలు చేసినట్టు తెలిసింది. పునాదులు తామే కట్టుకున్నామని, ఇసుక, రాయి వంటి మెటీరియల్‌ను కూడా తామే సమకూర్చుకున్నామని కొంత మంది లబ్ధిదారులు తెలిపారు. గతంలో మరుగుదొడ్లను స్లాబులతో నిర్మించారని, ప్రస్తుతం రేకులు వేసి చేతులు దులిపేసుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ అవకతవకలపై విచారణ నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఒక్కొక్క మరుగుదొడ్డుకు ప్రభుత్వం రూ.12,500 కేటాయించింది. అంటే 159 మరుగుదొడ్లకు రూ.19.87 లక్షలను మంజూరు చేసింది. ఇప్పటికే చాలా బిల్లులు కూడా కాంట్రాక్టర్‌ పేరున మంజూరయ్యాయి. ఇక చివరి బిల్లు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9392
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author