సిరులు కురిపిస్తున్న పందిరి పంటలు 

సిరులు కురిపిస్తున్న పందిరి పంటలు 
November 29 18:01 2017
ఆదిలాబాద్,
ఉపాధిహామీ పథకం కూలీలకే కాక రైతులకూ ఉపయుక్తంగా ఉంటోంది. ఇప్పటికే పలువురు రైతులు ఈ పథకం పరిధిలోకి వచ్చే పనులను చేపడుతూ లబ్ధిపొందుతున్నారు. నీటి కుంటలు, వ్యవసాయ బావులు తవ్వించుకుంటూ కూలీలకూ ఉపాధి లభించేలా తోడ్పడుతున్నారు. ఈ పనులకు చెల్లింపులు చేసేది ప్రభుత్వమే కావడంతో ఇరు వర్గాలకు లాభదాయకంగా ఉంది. ఇదిలా ఉంటే ఉపాధి హామీ పథకంలో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు రైతులు పందిరి సాగుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. సెర్ప్‌ పథకంలో భాగంగా పందిరి సాగుకు వీలుగా రాయితీ పొంది పరికరాలు ఏర్పాటు చేసుకుని కొందరు రైతులు కూరగాయల సాగు చేపట్టారు. పందిరిపై తీగజాతి కూరగాయలు, వాటి కింద క్యాబేజీ, క్యారెట్‌ వంకాయ, టమాట తదితర వాటిని సాగు చేస్తున్నారు. తలమడుగు మండలం కొత్తూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు అయితే తనకున్న మూడు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తోంది. రాయితీపై పందిరి సాగుకు చెందిన పరికరాలు ఇవ్వడంతో తీగజాతికి చెందిన బీర, కాకర తదితర పంటలు సాగు చేస్తోంది. ఏ రోజుకారోజు కూరగాయలను గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లి విక్రయించి ఆమె లబ్ధి పొందుతోంది.
ఉపాధిహామీ పథకంలో రూ. 1,05,000 యూనిట్‌ వ్యయం కింద పందిరి సాగును ప్రోత్సహిస్తున్నారు. సంబంధిత పనులు చేపట్టిన వారికి వంద శాతం రాయితీ ఇస్తున్నారు. అయితే రైతులు పంట భూమి, నీటి సౌకర్యం కలిగి ఉండి ముందుగా అవసరమైన పెట్టుబడిని సమకూర్చుకుని పందిరి వేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అధికారులు పొలానికి వచ్చి దానిని పరిశీలించి రైతుకు వంద శాతం రాయితీ కింద సొమ్ము అందిస్తారు. ఐకేపీలోనూ గతంలో ఈ పథకం ఉండేది పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్‌ గ్రామీణ ప్రాంత రైతుల కోసం మూడేళ్ల కిందట పందిరి సాగు పథకాన్ని ప్రవేశపెట్టింది. సాధారణ పద్ధతి కంటే పందిరి పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎక్కువ దిగుబడి సాధించే వీలుంది. దీంతో రైతులకు సబ్సిడీపై పరికరాలను అందించేందుకు రాయితీ సౌకర్యం కల్పించింది. దీనిలో భాగంగా పందిరి సాగుకు వీలుగా ఒక్కో రైతుకు వంద సిమెంటు స్తంభాలు, పది క్వింటాళ్ల తీగ, ఇంకా స్తంభాలు పాతేందుకు కూలీ డబ్బులు ఇస్తారు. ఇప్పటికే ఈ పథకం కింద జిల్లాలో 92 మంది రైతులు లబ్ధి పొందారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని గుడిహత్నూర్‌, ఇచ్చోడ, తలమడుగు, తాంసి, నేరడిగొండ, బేల, జైనథ్‌, ఆదిలాబాద్‌, బజార్‌హత్నూర్‌, బోథ్‌ తదితర మండలాలకు చెందిన పలువురు రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంద్వార తీగజాతి కూరగాయలు సాగు చేసుకునేందుకు వీలుగా పందిరిలు వేసి ఇచ్చారు. ఈ తరహా సాగుతో దాదాపుగా అన్ని చోట్ల చక్కని ఫలితాలు వచ్చాయి. దీంతో స్థానిక రైతాంగం ఈ సాగు తీరుపై ఆసక్తి చూపుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9422
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author