ఏపీని ఐటీలో మేటిగా ఆవిష్కరిస్తాం-లోకేశ్

ఏపీని ఐటీలో మేటిగా ఆవిష్కరిస్తాం-లోకేశ్
November 29 18:22 2017
 విజయవాడ,
అభివృద్ధి చెంది.. రవాణా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్న ప్రాంతంలోనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. కానీ నవ్యాంధ్ర విషయంలో కొంచెం భిన్నం. పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాల్సి ఉంది. ఆ పని జోరుగా సాగిస్తూనే ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఐటీ మంత్రిగా నారా లోకేశ్ సైతం ఈ క్రతువులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పట్టుదలతో బడా కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. లోకేశ్ తన శాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ పై దృష్టి సారించిన లోకేష్ ఐటీ రంగంపైనా కూడా పట్టు పెంచుకురు. విభజన ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగానికి కష్టకాలమే అన్న అపోహలకు తెరదించారు. ఐటీ పరిశ్రమలు కొత్త రాజధానికి వస్తాయా? రావా? అన్న సందేహాలను తొలగించారు. ఐటీ రంగాన్ని పటిష్టం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగేస్తున్నారు. తొలినాళ్లలో నవ్యాంధ్రకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఐటీ పరిశ్రమలు రాలేదు. అందుకు కారణం వాతావరణంతో పాటుగా రాకపోకలకు ఇబ్బందిగా ఉండటమే కారణం. అయితే వీటన్నింటినీ అధిగమించి రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావడంలో లోకేశ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. రెండేళ్లలో ఐటి రంగం ద్వారా లక్ష మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ హామీ ఇస్తున్నారంటే ఈ రంగం అభివృద్ధిపై ఆయన కచ్చితమైన విజన్ తో ఉన్నారనడానికి నిదర్శనం.
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిగా నారా లోకేశ్‌ చూపుతున్న చొరవతో రాష్ట్ర ఐటీ రంగంలో ఆశాజనక వాతావరణం నెలకొంది. గత ఏడాది మేధా టవర్స్‌లో ఐటీ కంపెనీల అక్యుపెన్సీ 10 శాతంగా ఉంటే, ఇప్పుడు అది 100 శాతానికి చేరుకోవడమే దీనికి నిదర్శనం. ఐటీ కంపెనీలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు అత్యంత ఆకర్షణీయంగా రూపొందించిన ఐటీ పాలసీతో నవ్యాంధ్రకు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ కూడా దీనికి తోడవుతోంది. మంత్రి లోకేశ్‌ చొరవ కారణంగానే 2016 వరకు ఖాళీగా ఉన్న మేధా టవర్స్‌ ఇప్పుడు ఐటీ కంపెనీలతో కళకళలాడుతోంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ చొరవ, చిత్తశుద్ధి వల్ల నెలల క్రితమే ప్రముఖ సంస్థలు మేధా టవర్స్ లో కొలువుదీరాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌తోనూ ఒప్పందం జరిగింది. ఈ సెక్టార్ ను బలపరిస్తే లక్షల్లో ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు. స్థానికంగా నిరుద్యోగాన్ని పారదోలవచ్చు. రాష్ట్రాభివృద్ధికి ఉన్న ప్రతికూలతలు, సవాళ్లనే పెట్టుబడులుగా మలచుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి లోకేశ్ సైతం ముఖ్యమంత్రిలానే సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఐటీ రంగంలో అభివృద్ధికి ఏళ్లు పడుతుందనుకున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ నెలల వ్యవధిలోనే ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా అభివృద్ధి విజన్స్ లో తండ్రికి తగ్గ తనయుడిలా దూసుకుపోతున్నారు లోకేశ్.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9437
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author