అమరావతికి మెట్రో మణిహారం ఎన్నడు?

 అమరావతికి మెట్రో మణిహారం ఎన్నడు?
November 29 21:29 2017
విజయవాడ,
భాగ్యనగరాన మెట్రో రైల్ పరుగులు తీస్తోంది. షెడ్యూల్ కాస్త లేటైనా మెట్రో రైలు.. ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అందరి చూపూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. అమరావతి ప్రాంతానికి మెట్రో మెరుపులు ఉంటాయా? ఉంటే ఎప్పుడు? అసలు మెట్రో ఆవశ్యకత ఉందా? అనే అంశాలపై ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైపోయింది. రాష్ట్ర విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో మెట్రో నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇక విభజన తర్వాత విజయవాడ-గుంటూరుల మధ్య మెట్రో ట్రాక్ వేయాలనీ అనుకున్నారు. దీనికి సంబంధించి కొంత కసరత్తు సైతం చేశారు. అయితే.. ఈ ఎక్సర్ సైజ్ కు మధ్యలోనే బ్రేక్ పడింది. మెట్రో స్థానంలో లైట్ మెట్రో ప్రతిపాదన వచ్చింది. అమరావతిలోనూ మెట్రో మెరుపులు ఉంటే బాగుంటుందని.. అభివృద్ధికి సూచికగా నిలుస్తుందని అంతా అంటున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితిని బట్టి నవ్యాంధ్రకు మెట్రో అవసరం పెద్దగా లేదు. అందుకే మెట్రోకు బదులు లైట్ మెట్రోపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో కంటే ఈ లైట్ మెట్రో ఖర్చు తక్కువే. నిర్మాణం, నిర్వహణల పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు.
నిర్మాణపరంగానే కాక నిర్వహణలోనూ మెట్రో రైలు కంటే లైట్ మెట్రో వ్యయం తక్కువ. ఇదే విషయాన్ని అధికారులు, నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. మెట్రో రైలు నిర్మాణానికి కిలోమీటరుకు 250 కోట్లు ఖర్చు అవుతుంది. అదే లైట్ మెట్రోకు అయితే 170 కోట్లు నుంచి 180 కోట్లు సరిపోతుందని అంచనా. 26 కిలోమీటర్ల దూరానికి లైట్ మెట్రోను 4272.97 కోట్లతో నిర్మించవచ్చన్నది నిపుణుల మాట. ఇక ఏటా నిర్వహణకు అయ్యే వ్యయం 106 కోట్లు ఉంటుందని అంచనా. అదే మెట్రోకి అయితే నిర్వహణ ఖర్చు 160 కోట్లుగా ఉంటుంది. దీంతో సర్కార్ లైట్ మెట్రోవైపు మొగ్గుచూపుతోంది. రాబోయే 50సంవత్సరాల జనాభా పెరుగుదలకు అనుగుణంగా లైట్ మెట్రోకు ప్రణాళిక సిద్ధం చేశారు. విమానాశ్రయం, జక్కంపూడి కాలనీలను అనుసంధానించేలా ఈ రైలు మార్గంలో మార్పులు ప్రతిపాదించినట్లు గతంలో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  మూడు మార్గాల్లో 40కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించాల్సి ఉంటుందని వివరించాయి. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే విజయవాడ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తొలగిపోవడం ఖాయం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9484
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author