డిసంబర్1నుండి రామోజీ ఫిలి సిటీ లో మాహా చిత్రోత్సవం

డిసంబర్1నుండి రామోజీ ఫిలి సిటీ లో మాహా చిత్రోత్సవం
November 29 22:27 2017
హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లకు చెందినా వినోదాత్మక రంగాలకు చెందిన అతిరధ మహారధులు పాల్గోనే ఈ మాహా చిత్రోస్తావాన్ని డిసంబర్ 1 వ తేదిన హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు ఇండివుడ్ వ్యవస్తాపక సంచాలకులు సోహన్రాయ్ తెలిపారు. బుదవారం ఎఫ్డిసిలో ఎఫ్డిసి చర్మెన్ పి.రామ్మోహన్ రావు, ఎఫ్డిసి ఎండి నవీన్ మిట్టల్ తో కలిసి మాట్లాడారు. అరబ్ ఏమేరేడ్ కు చెందిన ప్రవాస పారిశ్రామిక వేత్తైన సోహన్రాయ్ మనదేశానికి చెందినా సుమారు 2 వేల మంది వినోదాత్మక రంగం లోని బిలీనెస్స్ పాల్గోనే ఈ ఛిత్రోస్సవం భారత దేశం లో అతి పెద్దదైన రామోజీ ఫిలి సిటీ లో డిసంబర్ 1 వ తేది నుండి 4 వ తేది వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మన దేశం లో వినోదాత్మక రంగం లో పెట్టుబడులను ఆకర్షించే విదంగా ఇండివుడ్ బిలినియర్స్ క్లబ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రారంభోస్సవ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 400 బిలినియర్ పెట్టుబడి దారులతో పాటు మనదేశానికి చెందిన సుమారు 50 మందికి పైగా పెట్టుబడి దారులు పాల్గొంటారని తెలిపారు.మనదేశం లో వినోదాత్మక రంగం ఈ చిత్రోస్తావం వళ్ళ బాగా అభి వృద్ధి చెందుతుందని  ఈ రంగం లో విదేశీ పెట్టుబడుల్లో  విదేషి భాగస్వామ్యం బాగా పెరుగుతుందని రాయ్ అన్నారు.2020 సంవస్సరానికి 11 శాతం వృద్ధి  సాదించి 3.7 బిలియన్ డాలర్లు పెట్టుబడులతో స్థిరపడుతుందని  ఆయన వివరించారు.వినోదాత్మక రంగం లో మెఘ ప్రాజెక్ట్స్ అభి వృద్ధి చెందడానికి ఈ ఉస్సవం దోహదపడుతుందని,చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు దిస్త్రిబ్యుటర్లకు మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరి న్చారు.మనదేశంలో 20 భాషల్లో ప్రతి సంవస్సరం సుమారు 1500నుండి 2వేల చిత్రాలు నిర్మితమవుతున్నాయని ఐతే ప్రపంచదేశాలతో పోల్చుకుంటే ఆదాయం చాలా తక్కువని ఆయన అభిప్రాయ పడ్డారు.బిఆర్ఎస్ వెంచర్స్ చెర్మెన్ మరియు ఎంఎంసి గ్రూప్ వ్యవస్తాపకులు బి ఆర్ శెట్టి మహాభారతప్రాజెక్ట్ కు 1000 కోట్ల రూపాయలు అందజేస్తామని ప్రకటించారని రాయ్ తెలిపారు.ఈ 4 రోజుల ఇండివుడ్ చిత్రోస్తావం లో 15 భారీ కార్యక్రామాలు ఉంటాయని,100 దేశాలకు చెందిన సుమారు 250 చలన చిత్రాలు ప్రదర్శిస్తామని రాయ్ చెప్పారు.ఈ ఉస్తావం లో 300 మంది చిత్ర పంపిణి దారులు 5 వేల మంది సిని రంగానికి చెందిన ప్రతినిధులు,500 లకు పైగా పెట్టుబడి దారులు వీరితో పాటు ఇండివుడ్ కు చెందిన మరో 2500 మంది, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.ఈ సదస్సులో గోల్డెన్ ప్రేం అవార్డ్,రెడ్ కార్పెట్ మరియు నెట్వర్కింగ్ ఈవెంట్స్ ,ఫిలిం టూరిజం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9497
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author