ఊబర్ ఎక్స్చేంజ్ విజేతల్లో హైదరాబాదుకు అగ్రాసనం

ఊబర్ ఎక్స్చేంజ్ విజేతల్లో హైదరాబాదుకు అగ్రాసనం
November 29 23:06 2017
హైదరాబాద్,
రెండో రోజు గ్లోబల్ అంత్రప్రెన్యూర్ సమ్మిట్లో ఉదయం ప్రత్యేక షెషన్లో మాడరేట్ చేసిన మంత్రి కెటి రామారావు రోజంతా పలు కంపెనీల ప్రతినిధులను కలుస్తూ బీజీగా గడిపారు. తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ ఇంక్యుబేటర్ టి-హబ్, ప్రముఖ క్యాబ్ షేరింగ్ సంస్థ ఊబర్ కలిసి నిర్వహించిన ఊబర్ ఎక్స్చేంజ్ పోటీల విజేతలను ఇవ్వాళ జీ.ఈ.ఎస్. కాంఫరెన్సులో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అంకుర సంస్థలు ఈ పోటిలో పాల్గొనగా పది సంస్థలను తుది విజేతలుగా ఇవ్వాళ ప్రకటించారు. ఇందులో హైదరాబాదుకు చెందిన సంస్థలే అయిదు ఉండటం సంతోషకరమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. అంకుర సంస్థలకు హైదరాబాద్ స్వర్గధామంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం తర్వరలోనే ఏలక్ర్టిక్ వెహికిల్ పాలసీ తీసుకుని వస్తుందన్నారు. నిన్ననే ప్రారంభం అయిన మెట్రోకు మారుమూల ప్రాంతల నుండి కనెక్టీవీటీ  మొరుగుపరిచేందుకు కోసం దేశంలోని అన్ని మోబిలీటీ స్టార్ట్ అప్స్ ప్రయత్నం చేయాలని కోరారు. ఊబర్ ఇండియా హెడ్ అమిత్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ హెడ్ జేంస్ హెయిర్స్టన్, బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆష్ జవేరి, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్‌లు ఇవ్వాళ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, డేటా అనలటిక్స్ రంగంలో తమ కంపెనీ చేస్తున్న పనిని వారు మంత్రికి వివరించారు. టీ-హబ్ తో కలిసి ఫేస్‌బుక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా చర్చ జరిగింది. జీ.ఈ.ఎస్ కాన్ఫరెన్స్ ను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఫేస్‌బుక్ ప్రతినిధులు కితాబునిచ్చారు..అమెరికా వెలుపల అతి పెద్ద ఆఫీసును ఫేస్‌బుక్ సంస్థ హైదరాబాదులో ఏర్పాటు చేసిందని. వారు భవిశ్యత్తులో కొత్త విభాగాలను ఏర్పర్చదల్చుకుంటే అందుకు అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఐటీ మద్రాసు ప్రొఫెసర్ థిల్లై రాజన్ రచించిన “ఫ్యుయల్ ఫర్ స్టార్టప్స్”పుస్తకాన్ని ఇవ్వాళ జీ.ఈ.ఎస్. కాంఫరెన్సులో మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సి.ఈ.ఓ అమితాభ్ కాంత్ ఆవిష్కరించారు. అంకుర సంస్థలు, వెంచర్ క్యాపిటల్ రంగంపై రాసిన ఈ పుస్తకం ఇప్పుడు ఈ రంగంలోకి వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, యువతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పుస్తకం ఆవిష్కరించిన అనంతరం మంత్రి కేటీఆర్ అన్నారు. జీ.ఈ.ఎస్ సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉన్నదని మంత్రి అభిప్రాయపడ్డారు.అస్ట్రేలియన్ హైకమీషనర్ హరిందర్ సిద్దుతో మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్టంలో విద్య రంగం, గనులు, యానిమేషన్ గేమింగ్ రంగాల్లో అస్ర్టేలియన్ కంపెనీలకున్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. అస్ర్టేలియా యూనివర్సీటీలకు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరుగుతున్నదని, అస్ర్టేలియన్ యూనివర్సీటీల భాగస్వామ్యంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న గేమింగ్ టవర్ , ఈ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9513
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author