ఔషధ కంపెనీలకి  ఉచ్చు

ఔషధ కంపెనీలకి  ఉచ్చు
November 30 14:33 2017
మెదక్,
క్లినికల్ ట్రయల్స్ పేరిట అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఔషధ కంపెనీల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఐదు నెలల క్రితం నాగంపేటవాసి నాగరాజు మృతి సంచలనం సృష్టించగా, తాజాగా మరో ఉదంతం కలకలం రేపుతున్నది. బెంగళూర్‌కు చెందిన ఫార్మా కంపెనీల ప్రయోగాల వల్లే కొత్తపల్లికి చెందిన వలంటీర్ చిలువేరు అశోక్ కుమార్ మతిస్థిమితం కోల్పోయినట్లు తెలుస్తుండగా, దీనిపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ మొదలైంది. బుధవారం జమ్మికుంట తహసీల్దార్‌తోపాటు హుజూరాబాద్ మేజిస్ట్రేట్ ఎదుట బాధితుడు సదరు కంపెనీల గుట్టు విప్పడం చర్చనీయాంశమవుతున్నది. చికిత్స కోసం బాధితుడిని నేడు ఎర్రగడ్డకు తరలిస్తుండగా, సదరు కంపెనీల్లో వణుకుపుడుతున్నది. క్లినికల్ ట్రయల్స్ పేరిట అమాయకులను బలి చేస్తున్న ఔషధ కంపెనీలకు ఉచ్చు బిగుస్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. గతంలో నాగంపేటకు చెందిన వంగర నాగరాజు మృతికి, ఇప్పుడు కొత్తపల్లికి చెందిన చిలువేరు అశోక్ కుమార్ మతిస్థిమితం కోల్పోయేందుకు బెంగళూర్‌కు చెందిన ఔషధ కంపెనీలు చేస్తున్న ప్రయోగాలే కారణమనే ఆరోపణలు బలపడుతున్నవి. బాధితులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో మీడియాలో కథనాలు రాగా, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఓ కంపెనీపై కేసు నమోదుకాగా, దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే వలంటీర్ అశోక్‌కుమార్ మతిస్థిమితం కోల్పోగా, అతడి తల్లి కమల మంగళవారం ఇంట్లో నుంచి తన కొడుకు అదృశ్యమయ్యాడనీ, ఇందుకు బెంగళూరుకు చెందిన ఓ రెండు ఫార్మా కంపెనీలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, అశోక్ ఇంటికి సురక్షితంగా చేరాడు. కాగా, కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్ ఆదేశాలతో జమ్మికుంట మండల తహసీల్దార్ బావూసింగ్ బుధవారం విచారణకు దిగారు. బాధితుడు అశోక్ ఇంటికి వచ్చి, బాధితుడు, అతడి కుటుంబంతో మాట్లాడారు. వలంటీర్ అశోక్‌కుమార్ తాను వెళ్లిన ఔషధ కంపెనీల పేర్లు, ప్రదేశాలు, పట్టణాలు, ఎన్నిసార్లు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నాడనే విషయాలన్నీ తహసీల్దార్‌కు వివరించాడు. కంపెనీలకు తనను పరిచయం చేసిన వ్యక్తుల పేర్లు వెల్లడించాడు. తాను తీసుకున్న డబ్బు విషయాన్ని తెలిపాడు. మానసిక పరిస్థితిని చెప్పాడు. తర్వాత బాధితుడి కుటుంబం వద్ద కూడా వివరాలు సేకరించారు. సమాచారమంతా రికార్డు చేశారు. అనంతరం తహసీల్దార్ బావూసింగ్ మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేశానని చెప్పాడు. క్లినికల్ ట్రయల్స్‌లో అశోక్ పాల్గొన్నట్లు చెప్పాడనీ, ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని స్పష్టం చేశారు. తర్వాత సీఐ ప్రశాంత్‌రెడ్డి ఆదేశాలతో ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు, బాధితుడు అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అశోక్, అతడి తల్లి కమలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9584
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author