జిల్లా స్థాయి కుమ్మరి, శాలివాహన ఫెడరేషన్

జిల్లా స్థాయి కుమ్మరి, శాలివాహన ఫెడరేషన్
November 30 18:27 2017
సచివాలయం
రాష్ట్రంలో కుమ్మర్ల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా స్థాయి కుమ్మరి, శాలివాహన ఫెడరేషన్ కమిటీల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జీవో నెంబర్ 36ను విడుదలయినట్లు రాష్ట్ర కుమ్మరి, శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మట్టి సేకరణలో కుమ్మర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. నాయీబ్రాహ్మణ, రజకుల సంక్షేమ సంఘాల మాదిరిగా కుమ్మర్లకు కూడా జిల్లా స్థాయి సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడును కోరామన్నారు. దీనికి సీఎం చంద్రబాబు అంగీకరించి, కుమ్మరి, శాలివాహన జిల్లా స్థాయి ఫెడరేషన్ల  ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 36ను విడుదల చేసిందన్నారు. జీవో ప్రకారం ఆయా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన 8 మంది అధికారులు, నలుగురు కుమ్మర, శాలివాహన ప్రతినిధులతో కలిసిన 13 మంది సభ్యుల జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు కానున్నాయన్నారు. కుమ్మర్లు, శాలివాహనలకు స్వయం ఉపాధి కోసం రూ.64 కోట్లు విడుదల చేశామన్నారు. రుణాల మంజూరులో బ్యాంకులు అడ్డుంకులు సృష్టిస్తున్నాయని, ఇదే విషయం సీఎం చంద్రబాబునాయుడుకు వివరించామన్నారు. జీవో నెంబరు 36 విడుదలకు కృషి చేసిన సీఎం చంద్రబాబునాయునాయుడుకు, మంత్రి అచ్చెన్నాయుడుకు కుమ్మర్లు, శాలివాహన కులస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. తమ కులస్తులు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కుమ్మర, శాలివాహన ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఈమాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9651
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author